Prehistoric deep-sea fish, has been caught off the UK coast: అరుదైన ఓ సముద్ర చేప అట్లాంటిక్ రెక్ ఫిష్ యూకే తీరంలో పట్టుబడింది. యూకే కార్న్‌వాల్‌లోని ఫాల్‌మౌత్ సమీపంలో ఈ అరుదైన చేపను గుర్తించారు. ఈ జాతి చేప సాధారణంగా ఉపరితలం నుండి వందల మీటర్ల దిగువన నివసిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సముద్ర చేప ఇతర సొరచేపలను కూడా తినగలికే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పరిశోధనలో తేలింది. ఈ సొర చేప చాలా కాలం పాటు జీవించగలదు. 100 సంవత్సరాలకు పైగా జీవించగలదని, ఇది సముద్రంలో లోతైన నీటిలో, తరచుగా ఓడరేవుల్లో మాత్రమే జీవిస్తుందని తెలిపారు. స్వరూపం, నివాసం పరంగా చూస్తే ఈ చేప పెద్ద తల, నోరు కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా అనేక వందల మీటర్ల లోతులో నివసిస్తుంది. ఈ సముద్ర చేప తరచుగా ఓడ శిథిలాల దగ్గర కనిపిస్తుంది. అందుకే దీనికి ఈ పేరు వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. అట్లాంటిక్ రెక్ ఫిష్ ఇతర సముద్ర జంతువులు, స్క్విడ్‌లతో పాటు ఇతర సొరచేపలను తినగలదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అరుదైన సముద్ర చేప పురాతనమైన జాతిగా పరిగణించబడుతుంది. 100 సంవత్సరాల వరకు ఇది జీవించగలదు. ఈ అరుదైన చేపను దాదాపుగా మానవులు ఎప్పుడూ చూసి ఉండరని చరిత్రకారులు చెబుతున్నారు. కాగా, యూకే తీరంలోని కార్న్‌వాల్ ఫాల్మౌత్ తీరంలో ఓవెన్ మేట్స్ అనే జాలరి ఈ అరుదైన సముద్ర చేపను పట్టుకున్నాడు. ఈ నమూనా 70–80 సెం.మీ మధ్య, 10–12 పౌండ్లు బరువు కలిగి ఉంటుందని తెలిపారు. ఇది యూకే చరిత్రలోనే రికార్డుగా నిలుస్తుందని చెబుతున్నారు.
అంతర్వేదిపాలెం ఫిషింగ్ హార్బర్‌లో టెకు చేప..
ఇటువంటి అరుదైన చేపలు విదేశాల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తుంటాయి. తాజాగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం మినీ ఫిషింగ్ హర్బర్‌లో మత్స్యకారుల వలకు టేకు చేప చిక్కింది. 15 కిలోల బరువున్న పులిమచ్చల టేకు చేపను చూసి ఆశ్చర్యపోయారు స్థానికులు. ఈ చేపను వేలం వేయగా మంచి ధర పలికినట్లు మత్స్యకారులు తెలిపారు. ఈ చేప ఔషధాలకు పెట్టింది పేరని, దీనిని మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారని మత్స్యకారులు తెలిపారు. ఈ చేప ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంటుందని, ఈ క్రమంలో జాలర్ల వలలో చిక్కుతుందని వివరించారు. దీనిని పోటీపడి మరీ అధిక ధరకు కొనుగోలు చేస్తుంటారు. అందుకే ఈ చేప చిక్కితే మత్స్యకారులకు అదృష్టమే అంటారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సమీపంలో సముద్రంలో అరుదుగా కనిపించే టేకు చేప.. ప్రపంచ దేశాల్లో రేర్ ఫిష్‌గా గుర్తిస్తారు. దీనిని ఆక్వేరియంలో కూడా పెంచుకుంటారు. అందుకే ఈ చేపకు డిమాండ్ ఎక్కువ. ప్రోటీన్ అధికంగా ఉండే పులి మచ్చల టేకు చేప. కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుందని తక్కువ కొవ్వు ఉండడంతో గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.


