International market: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మరోసారి ఆకాశాన్ని తాకాయి. ఇరాన్‌పై అమెరికా విధిస్తున్న ఆంక్షల నేపథ్యంలో చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. దీంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 120 డాలర్లకు చేరుకుంది. 2022 తర్వాత ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
హర్మూజ్ జలసంధి దిగ్బంధం: ఇరాన్ అణు ఒప్పందం చేసుకునే వరకు హర్మూజ్ దిగ్బంధనం కొనసాగతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడంతో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. చమురు ధరల పెరుగుదల వల్ల భారత్ వంటి దిగుమతి చేసుకునే దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ తన వైఖరిని మార్చుకోకపోతే చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also read-Iran: ఈసారి భీకర దాడే.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

