Iran Protests Women Smoking: ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అక్కడ సుప్రీం లీడర్ ఫొటోలకు నిప్పంటించడం, మహిళలు సిగరెట్ తాగడం రెండూ నేరమే. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇరాన్ మహిళలు, యువతులు ఖమేనీ ఫొటోలకు నిప్పంటించి సిగరెట్లు వెలిగించుకుంటున్నారు. మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా, స్వేచ్ఛను కోరుకుంటున్నట్లు చూపిస్తూ వాళ్లు చేస్తున్న నిరసనలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అక్కడ మరో సంఘటన వైరల్ అవుతోంది. అక్కడి యువతులు, మహిళలు మరో అడుగు ముందుకేసి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఫోటోలకు నిప్పంటించారు. ఆ నిప్పుతో సిగరెట్లు వెలిగించి కాల్చడం నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాగా, 2022లో యువతి లాకప్ డెత్ సమయంలోనూ మహిళలు ఇదే రీతిలో నిరసనలు చేశారు.
రక్తసిక్తంగా ప్రజా తిరుగుబాటు
ఇరాన్‌లో కఠినమైన సామాజిక ఆంక్షలు, మహిళల హక్కులపై పరిమితులకు వ్యతిరేకంగా గత రెండు వారాలుగా ప్రజా తిరుగుబాటు రక్తసిక్తంగా మారింది. ఈ మధ్యప్రాచ్య దేశంలో 86ఏళ్ల ఖమేనీ మతతత్వ పాలనకు, అణచివేత చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతం అవుతున్నాయి. ఈ తరుణంలో ఖమేనీ ఫొటోలు తగలబెట్టి ఆ నిప్పుతో మహిళలు సిగరెట్లు కాల్చడం ట్రెండ్ అవుతోంది.
‘ఖమేనీ మరణం’ అంటూ నినాదాలు
కాగా, ఇరాన్‌లో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ, ఆకాశాన్నంటుతున్న నిత్యవసరాల ధరలపై ఈ నిరసనలు మొదలయ్యాయి. కొన్ని రోజుల్లోనే ఖమేనీ పాలన, అవినీతికి వ్యతిరేకంగా ఒక విస్తృత ఉద్యమం చెలరేగి.. ప్రజలు ఇస్లామిక్ రిపబ్లిక్‌నే పూర్తిగా తిరస్కరించే పరిస్థితి ఏర్పడింది. ‘ఖమేనీకి మరణం’, ‘పహ్లావీ తిరిగి వస్తాడు’ వంటి నినాదాలతో ఇరాన్ ప్రతిధ్వనిస్తోంది. కాగా, పహ్లావీ.. 1979 విప్లవం సమయంలో పదవీచ్యుతుడైన ఇరాన్ చివరి షా కుమారుడు.
Also Read: https://teluguprabha.net/national-news/bjp-suspends-58-dissent-civic-polls-mumbai-nagpur/
An Iranian girl burns a picture of Ayatollah Khamenei and lights her cigarette, a new trend in Iran!
Young Iranian women are leading the revolution against the Islamic regime.
— Dr. Maalouf (@realMaalouf) January 10, 2026
భయపడేది లేదు
కాగా, గతేడాది ఒమిద్ సర్లాక్ అనే ఇరానీయుడు, ఖమేనీ ఫోటోకు నిప్పంటిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ కావడంతో ఆ కాసేపటికే సర్లాక్ మృతదేహాన్ని అతడి కారులోనే పడేశారు. ప్రభుత్వ వ్యతిరేక పాల్గొన్న వారికి, ప్రభుత్వ భవనాలను తగలబెట్టిన నిరసనకారులకు మరణశిక్ష విధిస్తామని టెహ్రాన్ ప్రధాన ప్రాసిక్యూటర్ హెచ్చరించినా.. నిరసనకారులు పట్టించుకోకపోగా మరింత ఉద్ధృతం చేశారు.

