Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్PM Modi: బంగ్లాకు సాయం చేయడానికి భారత్ సిద్ధం

PM Modi: బంగ్లాకు సాయం చేయడానికి భారత్ సిద్ధం

Bangladesh: ఈ రోజు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం జరిగింది. ఢాకా లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న మైల్‌స్టోన్ పాఠశాలలో బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం కూలి 19 మంది మరణించారు. మరో 164 మంది గాయపడ్డారు. ఈ విషాదానికి గుర్తుగా, బంగ్లాదేశ్ మంగళవారం రోజుని జాతీయ సంతాప దినంగా ప్రకటించింది.

- Advertisement -

ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ లో బంగ్లాకు భారత్‌ అండగా ఉంటుందని, అన్నివిధాలా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు మోదీ తెలిపారు. ఈ ఘటనలో చాలా వరకు విద్యార్థులు ఉన్నారని, వారి మృతి కలిచివేసిందని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు మోదీ ట్వీట్ చేసారు. దాదాపు వంద మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. వారంతా త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

Readmore: https://teluguprabha.net/international-news/delta-flight-pilot-makes-aggressive-maneuver-to-avoid-collision/

ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఒక ఘటన మరువక ముందే మరొకటి. భయభ్రాంతులకు గురిచేసిన అహ్మదాబాద్ ఘటన అనంతరం మరింతగా పెరిగిన విమాన ప్రమాదాలు. ప్రపంచం నలుమూలల సాంకేతిక సమస్యలతో ఏదో ఒక చోట విమాన అత్యవసర ల్యాండింగ్ చేయటం చూస్తున్నాం. సరైన సమాచారం లేక ఇటీవల కాలంలో యుద్ధ విమానం, ప్రయాణికుల విమానం ఎదురు పడ్డాయి. పైలట్ అప్రమత్తతో ప్రమాదం సంభవించలేదు. లేదంటే అది కూడా చరిత్రలో నిలిచిపోయే ప్రమాదాలలో ఒకటయ్యేది.

Readmore: https://teluguprabha.net/international-news/bangladesh-air-force-jet-crashes-into-school-in-dhaka/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad