Sunday, October 6, 2024
Homeఇంటర్నేషనల్Rihanna: రిహన్నా ప్రెగ్నెంట్, బాయ్ ఫ్రెండ్ తో కలిసి బిడ్డకు జన్మనివ్వనున్న సింగర్

Rihanna: రిహన్నా ప్రెగ్నెంట్, బాయ్ ఫ్రెండ్ తో కలిసి బిడ్డకు జన్మనివ్వనున్న సింగర్

రిహన్నా ప్రెగ్నెంట్ గా ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. తన బేబీ బంప్ ను చూపిస్తూ, ట్రెండీగా రెడీ అయిన రిహన్నా న్యూ యార్క్ సిటీలో తన బాయ్ ఫ్రెండ్ రాకీతో షికార్లు కొడుతూ కనిపించారు. ర్యాపర్ అయిన రిహన్నా బాయ్ ఫ్రెండ్ రాకీతో చేతిలో చేయి వేసుకుంటూ వెళ్లే పిక్ వైరల్ గా మారింది.

- Advertisement -

2020లోనే లవ్ ఆఫ్ మై లైఫ్ గా రిహన్నాను అభివర్ణించాడు రాకీ. లండన్ లో 2019లో జరిగిన ఫ్యాషన్ అవార్డ్స్ కార్యక్రమానికి వీరిద్దరూ కలిసి అటెండ్ అయ్యారు. ఫ్యాషన్ కిల్లా అనే పాటకోసం వీరిద్దరు మొట్టమొదటిసారి 2013లో కలిసి పనిచేశారు. కానీ 2020 నుంచి వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉంటూ తరచూ కనిపిస్తూవస్తున్నారు. సింగర్, ఎంటర్ ప్రెన్యూర్ కూడా అయిన రిహన్నాకు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News