Homeఇంటర్నేషనల్Russia Vs Ukraine: ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. ఈసారి మామూలుగా కాదు!

Russia Vs Ukraine: ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. ఈసారి మామూలుగా కాదు!

Russia-Ukraine War: గత కొన్నేళ్లుగా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల చర్చలకు సిద్ధమని ప్రకటించిన రష్యా.. మళ్లీ దాడులకు దిగింది. చమురుశుద్ధి కార్మాగారాలు లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేయడంతో రష్యాలో ప్రతిదాడికి దిగింది. బుధవారం అర్ధరాత్రి క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. దీంతో రాజధాని నగరం కీవ్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. పలు నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. పేలుళ్ల శబ్ధంతో స్థానిక ప్రజలు వణికిపోయారు.

- Advertisement -

భయంకరమైన శత్రుదాడిగా అభివర్ణించిన జెలెన్‌స్కీ: బాలిస్టిక్, క్రూజ్‌ క్షిపణులతో రష్యా దాడికి దిగడంతో నిప్రో నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో తీవ్రనష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు ఒకరు మృతిచెందగా 11మంది గాయపడ్డారని ఉక్రెయిన్‌ ప్రభుత్వం అధికారికంగా పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సూచించారు. ఇది భయంకరమైన శత్రుదాడి అని అభివర్ణించింది.

Also read-Great Immigrants: సత్తా చాటిన ప్రవాస భారతీయులు.. అమెరికా గ్రేట్ ఇమిగ్రెంట్ జాబితాలో నలుగురికి చోటు

ఉక్కిరిబిక్కిరి అయిన రష్యా: గత కొన్నిరోజులుగా రష్యాలోని చమురుశుద్ధి కార్మాగారాలు లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్‌ ప్రభుత్వం డ్రోన్‌లతో విరుచుకుపడింది. దీంతో రష్యా ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ దాడుల కారణంగా రష్యాలో ఇంధన కొరత ఏర్పడింది. ఇంధన ధరలు పెరుగడంతో ప్రజలు బంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. దీంతో ప్రభుత్వం ఇంధనాన్ని రేషన్ పద్ధతిలో అందిస్తోంది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం స్వయంగా అంగీకరించారు. ఇంధన కొరతకు కారణమైన ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News