Russia Attacked On Ukraine: ఉక్రెయిన్ పై రష్యా ఏకంగా ఒకేసారి 300కి పైగా డ్రోన్లు, 30కి పైగా క్షిపణులతో దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో తీవ్రంగా ఆస్థి నష్టం జరిగిందని తెలిపారు. భవన శిథిలాల కింద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు.
ఒడెసా నగరంపై 20కి పైగా డ్రోన్లు, పదుల సంఖ్యలో క్షిపణులతో రష్యన్ దళాలు దాడి చేయగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అధ్యక్షుడు జెలెన్ స్కీ అండగా ఉంటున్న మిత్ర దేశాలకు అధ్యక్షుడు జెలెన్ స్కీ కృతజ్ఞతలు చెప్తూనే మౌలిక సదుపాయాలు దెబ్బతిని భారీ ఆస్థి నష్టం సంభవించిందని తెలిపారు.
Readmore: https://teluguprabha.net/international-news/pm-modi-trip-to-maldives-after-standoff/
ఆస్ట్రేలియా ఉక్రెయిన్ కి ఆయుధాలను సరఫరా చేస్తూ అండగా నిలుస్తుంది. కాల్పుల విరమణకు మంతనాలు జరుపుతున్న ఈ సమయంలో రష్యా ఇటువంటి దాడులు నిర్వహించడం నైతిక చర్య కాదని ఆస్ట్రేలియా రష్యాపై మండిపడుతుంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా కీవ్ కి M1A1 అబ్రమ్స్ ట్యాంకులను అందజేయగా.. ఇతర సామాగ్రిని కూడా నెలరోజుల్లో పంపుతున్నట్లు ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ పేర్కొన్నారు.
Readmore: https://teluguprabha.net/international-news/senate-opposes-death-penalty-for-harboring-hijackers/


