Russian Plane Crash: ప్రపంచవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏ విమానం ఎప్పుడు కూలుతుందో అర్థంకాని పరిస్థితి. తాజాగా మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది.
అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన An-24 ప్యాసింజర్ విమానం రష్యాకు తూర్పువైపు ఉన్న చైనా సరిహద్దులో కనిపించకుండా పోయింది. ఆ సమయంలో ప్లేన్ లో సిబ్బందితో సహా 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులందరూ చనిపోయినట్లు సమాచారం.
అంగారా ఎయిర్‌లైన్స్ రష్యా నుంచి చైనా సరిహద్దు ప్రాంతమైన అమూర్‌లోని టిండా పట్టణానికి వెళుతుండగా విమానం అదృశ్యమైంది. విమానం గమ్యస్థానానికి మరికొద్ది సేపట్లో చేరుతుందనగా..ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌తో సంబంధాలు తెగిపోయాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, టిండాకు 16కిమీ దూరంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
కాలిపోతున్న విమాన శిథిలాలను రష్యాకు చెందిన రెస్క్యూ హెలికాప్టర్ గుర్తించింది.
రష్యన్ మీడియా నివేదికల ప్రకారం, ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలో ఐదుగురు పిల్లలు సహా 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం ల్యాండింగ్ సమయంలో సిబ్బంది పొరపాటు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 1950లలో అభివృద్ధి చేయబడిన ఆంటోనోవ్ An-24 రష్యాలో కార్గో మరియు ప్రయాణీకుల రవాణా రెండింటికీ విస్తృతంగా ఉపయోగిస్తారు.


