ప్రేమను కొందరు చాలా సీరియస్‌గా తీసుకుంటారు. తమను నమ్మిన జీవిత భాగస్వామి లేదా లవర్ ని మనస్పూర్తిగా ప్రేమిస్తారు.. అయితే మరికొందరు మాత్రం ఇదే ప్రేమను అవకాశంగా మార్చుకుని మోసాలు చేస్తుంటారు. అయితే జపాన్ లో ఓ వ్యక్తి చేసిన మోసం హాట్ టాపిక్ గా మారింది. వీడు చేసిన పని తెలిస్తే.. మామూలోడివి కాదురా నాయనా నువ్వు అనుకుంటారు.
జపాన్ కి చెందిన తకాషి మియాగావా యూనేన్ ప్రిఫెక్చర్ లో ఉంటాడు. ఇతను వృత్తిరీత్యా సేల్స్‌మెన్. అయితే అతని లక్ష్యం మాత్రం ఏదో ఒక రూపంలో డబ్బులు సంపాదించడమే.. దీనికోసం అతడు ఏకంగా 35 మంది అమ్మాయిలతో ప్రేమ పేరుతో డేటింగ్ చేయడం మొదలు పెట్టాడు. అంతేకాదు ఒక్కొక్కరికి ఒక్కో పుట్టినరోజు డేట్ చెప్పి వారి దగ్గర నుంచి భారీగా గిఫ్ట్స్ కొనిపించుకున్నాడు.
జపాన్‌లో బర్త్ డే గిఫ్ట్ ఇవ్వడం డేటింగ్ కల్చర్‌లో కామన్. ఈ విషయాన్ని తన లాభంగా మార్చుకున్న మియాగావా… ఏడాదంతా బహుమతులు పొందాడు.. దాదాపు లక్షల రూపాయల విలువైన గిఫ్ట్‌లు సొంత చేసుకున్న మియాగావా.. అయితే అతడి మోసం ఎక్కువ రోజులు నడవలేదు. మెల్లగా మహిళలందరూ అసలు సంగతి గ్రహించి కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తనను ప్రేమిస్తున్నానంటూ నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. దీంతో మియాగావాను అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో మోసం చేయడం కూడా నేరమేనని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. డేటింగ్ సంబంధాల్లో నమ్మకం, నిజాయితీ ఎంత అవసరమో గుర్తు చేసింది.