Homeఇంటర్నేషనల్Sanae Takaichi: జపాన్ రాజకీయాల్లో సంచలనం.. సనాయే తకైచికి అఖండ మెజారిటీ.!

Sanae Takaichi: జపాన్ రాజకీయాల్లో సంచలనం.. సనాయే తకైచికి అఖండ మెజారిటీ.!

First Woman PM of Japan : జపాన్ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సనాయే తకైచి, తన పదవీకాలం మధ్యలోనే జరిగిన స్నాప్ ఎన్నికల్లో (Snap Elections) భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆమె నేతృత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) ఫిబ్రవరి 8, 2026న జరిగిన ఎన్నికల్లో లోయర్ హౌస్‌లో ‘సూపర్ మెజారిటీ’ సాధించింది.

- Advertisement -

మొత్తం 465 సీట్లున్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఎల్‌డీపీ ఒక్కటే 316 సీట్లు గెలుచుకుంది. మిత్రపక్షాలతో కలిపి ఈ సంఖ్య 352కు చేరింది, ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ రాజకీయాల్లో ఒకే పార్టీ సాధించిన అతిపెద్ద విజయం కావటం గమనార్హం.

Kakani: ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ.. బ్రిటిష్ పాలనను మించిన అరాచకం: కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం

రిస్క్ తీసుకున్న ‘జపాన్ ఐరన్ లేడీ’

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కేవలం 110 రోజుల్లోనే తకైచి లోయర్ హౌస్‌ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం ఒక పెద్ద సాహసంగా రాజకీయ వర్గాలు భావించాయి. “ప్రజల తీర్పు లేకుండా పాలన కొనసాగించడం సరైనది కాదు” అని ప్రకటించిన ఆమె, ఒకవేళ ఓడిపోతే రాజీనామా చేస్తానని కూడా సవాల్ విసిరారు. అయితే, ఆమె చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, ఇమ్మిగ్రేషన్‌పై కఠిన వైఖరి , రక్షణ రంగ బలోపేతం వంటి నిర్ణయాలకు ప్రజలు పట్టం కట్టారు. ముఖ్యంగా యువతలో ఆమెకు ఉన్న ఆదరణను ‘సనామానియా’ (Sanamania) అని పిలుస్తున్నారు.

భారత్-జపాన్ సంబంధాలపై ప్రభావం

సనాయే తకైచి విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభినందనలు తెలిపారు. భారత్-జపాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రపంచ శాంతికి , స్థిరత్వానికి ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.

తకైచి నాయకత్వంలో రెండు దేశాల మధ్య స్నేహం మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్‌ను ఆదర్శంగా తీసుకున్న 64 ఏళ్ల తకైచి, చైనా విషయంలో బలమైన వైఖరిని అవలంబించే నాయకురాలిగా పేరు పొందారు.

Horse Safaris : హుషారైన హార్స్ సఫారీ..భాగ్యనగరంలో గుర్రపు స్వారీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News