Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Come and Say G’Day: బ్రాండ్ అంబాసిడర్ గా సారా టెండూల్కర్

Come and Say G’Day: బ్రాండ్ అంబాసిడర్ గా సారా టెండూల్కర్

Australia: ఆస్ట్రేలియా పర్యాటక శాఖ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తోంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్తగా ప్రారంభిస్తున్న గ్లోబల్ టూరిజం క్యాంపెయిన్ ప్రచారానికి దాదాపు 130 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు, అంటే రూ. 1137 కోట్లు కేటాయించారు. ఈ ప్రచారం పేరు Come and Say G’Day గా నిర్ణయించారు.

- Advertisement -

ఆస్ట్రేలియా పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు పలు దేశాల్లో ప్రచారం చేపడుతుంది. ఈ ప్రచారంలో భాగంగా భారత దేశంలో జరిగే ప్రచారానికి  దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. భారత్‌తో పాటు అమెరికా, యూకే, చైనా, జపాన్ వంటి దేశాలలో ఈ ప్రచారం జరుగుతుంది.

Readmore: https://teluguprabha.net/international-news/china-tightens-travel-restrictions-govt-employees/

ప్రతి దేశం నుంచి ఒక ప్రముఖ వ్యక్తిని ఈ క్యాంపెయిన్‌లో భాగం చేశారు. అమెరికా నుండి వైల్డ్‌లైఫ్ యాక్టివిస్ట్ రాబర్ట్ ఇర్విన్, యూకే బ్రాండ్ నుండి ప్రముఖ చెఫ్ నిగెల్లా లాసన్,  చైనా నుండి నటుడు యోష్ యూ, జపాన్ నుండి కమెడియన్ అబారెరు కున్ లను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఈ ప్రచారం ఆగష్టు7, 2025 న చైనా నుండి ప్రారంభం అవుతుంది.

ఈ ప్రచారంతో ఆస్ట్రేలియాలోనే పర్యాటక ప్రదేశాలకు ఆయా దేశాల పర్యాటకుల తాకిడి పెరిగి, పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. టూరిజం ఆస్ట్రేలియా మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిపా హారిసన్ మాట్లాడుతూ.. ఈ ప్రచారంలో ప్రసిద్ధ కార్టూన్ కంగారూ రూబీ ది రూ భాగస్వామ్యం ఉందని తెలిపింది.

Readmore: https://teluguprabha.net/international-news/68-migrants-die-boat-sinks-off-yemen-coast/

సారా టెండూల్కర్ తండ్రికి తగ్గ తనయ. సారా టెండూల్కర్ గ్లోబల్ ఇ-క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2లో ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేసి, యజమానిగా మారారు. అలాగే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ తన పోస్ట్‌లతో అభిమానులను అలరిస్తుంది. ఆస్ట్రేలియాలోని పర్యాటక ప్రాంతాల గురించి వివరిస్తూ దేశ ప్రజలను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad