Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్India-China relations: జిన్‌పింగ్ రహస్య లేఖ.. భారత్-చైనా సంబంధాలలో అనూహ్య మలుపు!

India-China relations: జిన్‌పింగ్ రహస్య లేఖ.. భారత్-చైనా సంబంధాలలో అనూహ్య మలుపు!

Xi Jinping Letter Was Key To Improved India-China Ties: గత కొన్నేళ్లుగా సరిహద్దు ఉద్రిక్తతలతో దెబ్బతిన్న భారత్-చైనా సంబంధాలలో ఒక అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. దీని వెనుక చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన ఒక “రహస్య లేఖ” కీలక పాత్ర పోషించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక సంచలనం సృష్టిస్తోంది. ఈ పరిణామాలకు అసలు కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన వాణిజ్య విధానాలే కావడం గమనార్హం.

- Advertisement -

ALSO READ: JD Vance: అమెరికా ప్రెసిడెంట్ పగ్గాలకు రెడీ అంటున్న జేడీ వాన్స్.. అసలు ట్రంప్‌కి ఏమైంది..?

ఈ ఏడాది ఆరంభంలో ట్రంప్, చైనాపై వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేయడంతో, చైనా భారత్‌తో సంబంధాలను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే జిన్‌పింగ్ ఈ లేఖను రాశారని, ప్రధాని మోదీకి కూడా ఈ విషయం చేరిందని ఆ నివేదిక పేర్కొంది. భారత్-అమెరికా మధ్య తమ ప్రయోజనాలకు భంగం కలిగించే ఒప్పందాలు జరగకూడదన్నది ఆ లేఖ సారాంశం. భారత్ సుముఖతను పరీక్షించడానికే జిన్‌పింగ్ ఈ ఎత్తుగడ వేశారని తెలుస్తోంది.

ALSO READ: Trump tariffs India : భారత్‌పై అమెరికా చర్యలు ఎలుక ఏనుగుతో ఢీకొనటమే – రిచర్డ్ వోల్ఫ్

మరోవైపు, ట్రంప్ సుంకాల బెదిరింపులతో ఇబ్బంది పడుతున్న భారత్, చైనా ప్రతిపాదనను తీవ్రంగా పరిగణించడం మొదలుపెట్టింది. ఫలితంగా, 2020 నాటి సరిహద్దు ఘర్షణలను పక్కనపెట్టి, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి.

“ఏనుగు, డ్రాగన్ కలిసి నాట్యం చేయడమే సరైన మార్గం”

ఈ కొత్త మైత్రికి సంకేతంగా, భారత్-చైనా మధ్య త్వరలో ప్రయాణికుల విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. చైనాకు చెందిన పర్యాటకులకు భారత్ తిరిగి వీసాలు మంజూరు చేస్తోంది. “ఏనుగు, డ్రాగన్ కలిసి నాట్యం చేయడమే సరైన మార్గం” అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించడం ఈ మార్పును స్పష్టం చేస్తోంది. త్వరలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఏడేళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటించనుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

ALSO READ: Modi Japan Tour: టోక్యోలో మోదీ మంత్రం..పెట్టుబడుల ప్రవాహానికి పచ్చజెండా!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad