Friday, September 20, 2024
Homeఇంటర్నేషనల్Seoul: దక్షిణ కొరియా టూర్ లో మంత్రులు

Seoul: దక్షిణ కొరియా టూర్ లో మంత్రులు

పర్యాటకంగా దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, బోయినపల్లి వినోద్ కుమార్ కలిసి ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు సాంకేతక పరిజ్ఞానాన్ని జోడించి విదేశీ పర్యాటకులను రాష్ట్రానికి ఆకర్షించడమే లక్ష్యంగా ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం దక్షిణ కొరియా రాజధాని సీయోల్ వాటర్ రివర్ ఫ్రంట్ ను అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణ, గోదావరి నదుల వెంట అద్భుతమైన సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి రమణీయ దృశ్యాలు ఉన్నాయన్నారు.

- Advertisement -

గోదావరి నది ఒడ్డున ఉన్న కరీంనగర్ లోనీ మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి కి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, మహబుబ్ నగర్ లోని ట్యాంక్ బండ్ అభివృద్ధి, అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటెన్ జెయింట్ వీల్ వేవ్ పూల్, వాటర్ రైడ్స్,వాటర్ స్పోర్ట్స్ రాష్ట్రంలో మన్యంకొండ వద్ద మొట్టమొదటిసారిగా నిర్మిస్తున్న రోప్ వే, హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో పర్యాటకులకు కనువిందు చేసే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త కొత్త పర్యాటక ఆకర్షణలను తీర్చిదిద్దుతున్నామనీ మంత్రి డా. V. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రిజర్వాయర్ల వద్ద పర్యాటకంగా అనేక ఆకర్షణలను తీర్చిదిద్ది పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా తమ పర్యటన సాగుతుందని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి మంత్రులు డా. V. శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ లతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్ చేరుకోగా… దక్షిణ కొరియాలోని భారత రాయబారి విమానాశ్రయంలో మంత్రులకు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News