Pakistan Trump Relation : పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. గత మే నెలలో భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణాన్ని ట్రంప్ చల్లార్చారని, ఆయన ధైర్యవంతమైన నాయకత్వం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కాపాడబడ్డాయని కొనియాడారు.
ALSO READ: Postal Dak Sewa app : తపాలా సేవలు మరింత ఈజీ – ‘డాక్ సేవా’ యాప్‌తో ఒక్క క్లిక్‌లో అన్నీ పనులు!
అజర్‌బైజాన్ రాజధాని బాకూలో జరిగిన ‘విక్టరీ డే’ పరేడ్‌లో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వైరల్ కామెంట్స్ చేశారు. ఈ పరేడ్ కరబాఖ్ ప్రాంతంలో అజర్‌బైజాన్ సాధించిన విజయానికి సూచన అంటూ తెలుపుతూ, భారత్-పాక్ ఉద్రిక్తతలపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు.
మే 2025 ఉద్రిక్తతల నేపథ్యం
గత మే 10న లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంబడి భారత్-పాక్ మధ్య తీవ్ర దాడులు జరిగాయి. పాక్ డ్రోన్‌లు, క్షిపణులతో భారత సైనిక క్యాంప్‌లపై దాడి చేస్తే, భారత్ రాకెట్‌లు, ఆర్టిలరీతో స్పందించింది. నాలుగు రోజుల్లో 7 పాక్ జెట్‌లు కూలిపోయాయని, 200 మంది సైనికులు మరణించారని పాక్ వాదిస్తోంది. ఇది భారత్-పాక్ మధ్య పెద్ద స్థాయి యుద్ధంగా మారే అవకాశం కనిపించిన నేపథ్యంలో, ట్రంప్ వాషింగ్టన్ నుంచి ఫోన్ కాల్స్, బ్యాక్‌చానల్ డిప్లమసీతో ఇరు దేశాలు ‘పూర్తి కాల్పుల విరమణ’కు అంగీకరించాయని పాక్ చెప్పుకొస్తోంది. అంతే కాకుండా “ట్రంప్ జోక్యంతో దక్షిణాసియాలో శాంతి వచ్చింది. ఒక్క యుద్ధం ఆగడంతో లక్షల ప్రాణాలు నిలిచాయి” అని పొగడ్తలతో ముంచెత్తారు.
భారత్ మాత్రం ఈ వాదనను తిరస్కరిస్తోంది. మే 10న ద్వైపాక్షిక చర్చల ద్వారానే విరమణ వచ్చిందని, మూడో వ్యక్తి ప్రమేయం లేదని న్యూఢిల్లీలో స్పష్టం చేసింది. ట్రంప్ మీడియాకు “నా మధ్యవర్తిత్వం వల్లే యుద్ధం ఆగింది” అని చెప్పి, తన US ఎన్నికల ప్రచారంలో తన మద్దతు పెంచుకుంటున్నారు. షెహబాజ్ ప్రశంసలు ట్రంప్‌కు బూస్ట్ ఇచ్చాయి. అక్టోబర్‌లో షర్మ్ ఎల్-షేక్ గాజా సమ్మిట్‌లో కూడా షెహబాజ్ ట్రంప్‌ను ప్రశంసిస్తూ, నోబెల్ పీస్ ప్రైజ్‌కు ప్రతిపాదించారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇటాలీ ప్రధాని మెలోనీ ఆశ్చర్యంగా స్పందించిన వీడియో వైరల్ అయింది.
కశ్మీర్, పరేడ్ వివరాలు
బాకూ పరేడ్‌లో షెహబాజ్ కశ్మీర్ ప్రస్థావన తీసుకువచ్చారు. అజర్‌బైజాన్ కరబాఖ్ విజయం “కశ్మీర్ వంటి అణచివేతలకు గురైన ప్రాంతాలకు ఆశాకిరణం” అంటూ వైరల్ కామెంట్స్ చేశారు. పాక్ శాంతిని కోరుకుంటుందని, కానీ సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతపై రాజీపడదని తేల్చి చెప్పారు. పరేడ్‌లో అజర్‌బైజాన్, పాక్, తుర్కీ సైనికులు కవాతు చేశారు. పాక్ JF-17 థండర్ జెట్‌ల వైమానిక ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ పరేడ్ 2020 కరబాఖ్ యుద్ధ విజయాన్ని గుర్తుచేస్తూ జరిగింది.


