Homeఇంటర్నేషనల్America: అమెరికాలో కాల్పుల కలకలం.. ఏడుగురు మృతి!

America: అమెరికాలో కాల్పుల కలకలం.. ఏడుగురు మృతి!

Shooting in Iowa: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అయోవా రాష్ట్రంలోని మస్కటీన్‌లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం సదరు నిందితుడు సైతం.. తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది.

- Advertisement -

మూడు ప్రాంతాల్లో కాల్పులు: మస్కటీన్ నగరంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఓ దుండగుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. వరుసగా కాల్పులు జరుపుతూ ఆరుగురిని పొట్టనబెట్టుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులకు దొరకడం ఇష్టం లేక.. సదరు నిందితుడు తుపాకీతో కాల్చుకుని అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

కుటుంబ వివాదాలే కారణం?: ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని ర్యాన్ విల్లిస్ మెక్‌ఫార్లాండ్‌గా ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. కుటుంబంలో తలెత్తిన తీవ్ర వివాదాల కారణంగానే అతడు ఈ ఊచకోతకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక అధికార యంత్రాంగం, మృతుల వివరాలను సేకరిస్తూ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News