Homeఇంటర్నేషనల్America: వాషింగ్టన్‌లో కాల్పుల కలకలం.. సురక్షిత ప్రాంతానికి ట్రంప్‌

America: వాషింగ్టన్‌లో కాల్పుల కలకలం.. సురక్షిత ప్రాంతానికి ట్రంప్‌

Washington: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని హిల్టన్‌ హోటల్‌లో ఆదివారం రాత్రి భయానక వాతావరణం నెలకొంది. వైట్‌హౌస్‌ కరెస్పాండెంట్స్‌ అసోసియేషన్ వార్షిక విందు (WHCD) జరుగుతుండగా ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో వైట్‌హౌజ్‌ ఉలిక్కిపడింది.

- Advertisement -

అప్రమత్తమైన సీక్రెట్‌ సర్వీస్‌: కాల్పులు జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అత్యంత అప్రమత్తత ప్రదర్శించారు. వేదికపై ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్‌, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సహా ఇతర కీలక నేతలను చుట్టుముట్టారు. వారిని తక్షణమే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు: కాల్పుల శబ్ధం అనంతరం ఏం జరుగుతుందో అర్థం కాక హోటల్‌లో ఉన్న వందలాది మంది అతిథులు, జర్నలిస్టులు, సెలబ్రిటీలు ప్రాణభయంతో పరుగులు తీశారు. భద్రతా సిబ్బంది సూచనలతో చాలామంది అక్కడి టేబుళ్ల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. హోటల్ ప్రాంగణమంతా నిమిషాల వ్యవధిలోనే భద్రతా బలగాల ఆధీనంలోకి వచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News