సింగపూర్(Singapore) పేరుకే చిన్న దేశమైనా.. టెక్నాలజీ వినియోగంలో కానీ ఇతర అంశాల్లో పెద్ద పెద్ద దేశాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు క్రమశిక్షణ విషయంలో ముందుంటుంది. రూల్స్ పాటించడంలో చాలా స్ట్రీట్‌గా ఉంటుంది. తాజాగా పార్లమెంట్‌లో ఆ దేశ ఎంపీ అబద్ధాలు చెప్పడంతో ఏకంగా జరిమానా విధించింది.
అసలు ఏం జరిగిందంటే.. సింగపూర్‌లోని భారత సంతతి నేత ప్రీతమ్ సింగ్(Pritam Singh) ఆ దేశ పార్లమెంట్‌లోప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే ఆయనపై పార్లమెంటులో అబద్ధాలు చెప్పారనే అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన స్థానిక న్యాయస్థానం అబద్ధాలు చెప్పడం నిజమని తేల్చింది. దీంతో ఆయనకు 14వేల డాలర్ల (రూ.9లక్షల) జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. పార్లమెంట్ సభ్యుడిగా మాత్రం కొనసాగవచ్చని కాస్త ఊరట ఇచ్చింది. అదే మన దేశంలో అయితే చట్టసభల్లో నాయకులు విచ్చలవిడిగా అబద్ధాలు చెప్పినా ఎలాంటి శిక్షలు ఉండవని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.