Tuesday, February 10, 2026
Homeఇంటర్నేషనల్Plane Crash: జస్ట్ మిస్.. తప్పిన పెను ప్రమాదం..!

Plane Crash: జస్ట్ మిస్.. తప్పిన పెను ప్రమాదం..!

Southwest Airlines: ఇటీవల మిన్నియాపోలిస్‌ నుంచి మైనట్‌కు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం, బీ 52 బాంబర్‌ యుద్ధ విమానాన్ని ఢోకొన బోయింది. పైలట్ల అప్రమత్తతతో  విమానాన్ని పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జరిగిన కొద్దిరోజులకే సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కి సంబంధించిన విమానం కూడా ఇదే తరహా ఘటనను చవిచూసింది.

- Advertisement -

లాస్ ఏంజెలెస్‌లోని హాలీవుడ్ బర్బాంక్ విమానాశ్రయం నుంచి బయలు దేరిన ఈ విమానం వేల అడుగుల ఎత్తులో హాకర్‌ హంటర్‌ యుద్ధ విమానాన్ని ఢీకొనబోయింది. గగనతలంలో ఈ ప్రమాదం జరిగి ఉన్నట్లయితే చరిత్ర పుటల్లో మరో దుర్ఘటన అయి ఉండేది. అదృష్టవశాత్తు పైలట్లు యుద్ధ విమానం రాకను గమనించి తమ విమానాన్ని 500 అడుగుల మేర కిందకి దించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Readmore: https://teluguprabha.net/international-news/america-listing-trf-as-terror-group/

ఈ అనుకోని సంఘటన వలన విమానంలో ఏర్పడిన కుదుపులతో ఇద్దరు సహాయకులకు గాయాలు అయినట్టు ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ విమాన ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌ రాడార్‌-24  సామజిక మాధ్యమంలో షేర్‌ చేసింది. యుద్ధ విమానం ఎదురుగా వస్తుండడాన్ని గమనించిన పైలట్లు సెకన్ల వ్యవధిలో విమానాన్ని 14,100 అడుగుల నుంచి 13,625 అడుగుల మేర కిందకు దించినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

Readmore: https://teluguprabha.net/international-news/india-china-border-talks-candid-discussions/

రెండు విమానాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు ఎయిర్‌ ట్రాఫిక్ అలర్ట్, ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టీసీఏఎస్‌)  ద్వారా హెచ్చరికను జారీ చేసింది. ఈ హెచ్చరికతో పైలట్లు వేగంగా స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించినట్లు అధికారులు  పేర్కొన్నారు. అనంతరం విమానాన్ని తన గమ్యస్థానం అయిన లాస్ వెగాస్‌ లో సురక్షితంగా ల్యాండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయందోళనకు గురయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News