SpaceX: అంతరిక్ష పరిశోధనలో మరో ఆసక్తికర ఘట్టానికి తెరతీయనుంది. సుమారు ఏడాదిన్నర క్రితం రెండు ప్రైవేట్ లూనార్ ల్యాండర్ ను మోసుకెళ్లిన స్పేస్‌ఎక్స్ రాకెట్ బుధవారం దశ లక్ష్యం తప్పి చంద్రుడిని ఢీకొట్టబోతున్నట్లు అంతరిక్ష నిపుణులు తెలిపారు.దీని వల్ల చంద్రుడి పై పెద్ద బిలం ఏర్పడనున్నట్లు తెలుస్తుంది. దుమ్ము, శిథిలాలు అంతరిక్షంలోకి ఎగిసిపడనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఈ అరుదైన ఘటనను ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఖగోళ పరిశీలకులు గమనించనున్నారు. ఈ రాకెట్ భాగం చంద్రుడి ఐన్‌స్టీన్ క్రేటర్ సమీపంలో గంటకు సుమారు 8,700 కిలోమీటర్ల వేగంతో ఢీకొంటుంది. ఇది ధ్వని వేగానికి దాదాపు ఏడు రెట్లు ఎక్కువ. ఈ ప్రభావం శక్తి మూడు టన్నుల టీఎన్‌టీ పేలుడుతో సమానంగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు.
Also Read:Bhogapuram Airport: క్రెడిట్ చంద్రబాబు,జగన్ ది కాదు.. మొత్తం ఆయనదే!
ఈ తాకిడి కారణంగా సుమారు 27 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల లోతు గల బిలం ఏర్పడే అవకాశం ఉంది. ఢీకొట్టిన వెంటనే వెలువడే కాంతి చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ, చంద్రుడి తక్కువ గురుత్వాకర్షణ కారణంగా దుమ్ము, శిథిలాలు అనేక కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి, టెలిస్కోపుల ద్వారా పదుల నిమిషాల పాటు కనిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
నాసా లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్, దక్షిణ కొరియా డనూరి లూనార్ ఆర్బిటర్ ఈ ఘటనకు ముందు, తర్వాత చంద్రుడి ఉపరితల చిత్రాలను సేకరించనున్నాయి. ఈ పరిశీలనల ద్వారా భవిష్యత్ చంద్రయాత్రలకు అవసరమైన కీలక సమాచారం లభించే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.

