Thursday, May 29, 2025
Homeఇంటర్నేషనల్మళ్లీ విఫలమైన స్టార్‌షిప్ ప్రయోగం.. మస్క్ రియాక్షన్ ఇదే..!

మళ్లీ విఫలమైన స్టార్‌షిప్ ప్రయోగం.. మస్క్ రియాక్షన్ ఇదే..!

బుధవారం ఉదయం స్పేస్‌ఎక్స్ మరో సారిగా తన స్టార్‌షిప్ రాకెట్‌ను పరీక్షించేందుకు నింగిలోకి పంపింది. ఎలోన్ మస్క్ ఆశయాలకు ప్రతిరూపంగా నిలిచిన ఈ మిషన్‌ను అమెరికా టెక్సాస్‌లోని బోకా చికా బీచ్‌ దగ్గర ఉన్న స్టార్‌బేస్ నుంచి భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ప్రయోగించారు.

- Advertisement -

ఈ టెస్ట్‌కు “స్టార్‌షిప్ ఫ్లైట్ 9” అనే పేరు పెట్టారు. ఇందులో “షిప్ 25” అనే స్పేస్‌షిప్‌తో పాటు “సూపర్ హెవీ బూస్టర్”ను ఉపయోగించారు. 33 రాప్టర్ ఇంజిన్లలో 29 విజయవంతంగా పనిచేశాయి. గత ఫ్లైట్లలో ఎదురైన సమస్యలు ఈసారి అధిగమించగలిగారు. ముఖ్యంగా, “హాట్ స్టేజింగ్” అనే కీలక దశను సజావుగా పూర్తి చేశారు. ఇది బూస్టర్ వేరవకముందే, పై స్టేజ్ ఇంజిన్లు ఆన్ అయ్యే ప్రక్రియ.

కానీ ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. రాకెట్ ప్రయోగం తరువాత సుమారు 1.06 గంటల ప్రయాణంలో భూమి వాతావరణంలోకి ప్రవేశించే సమయానికి రాకెట్ నియంత్రణ కోల్పోయింది. దాంతో అది పేలిపోయిందని స్పేస్‌ఎక్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ లోపం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది.

ఎలోన్ మస్క్ ఈ రాకెట్ ద్వారా భవిష్యత్తులో మనుషులను చంద్రుడి మీదకైనా, అంగారక గ్రహంపైకైనా పంపాలన్న ధ్యేయంతో ఉన్నారు. ఈ ప్రయోగం చివరికి విఫలమైనా, ప్రయాణంలో సాధించిన కొన్ని విజయాలు భవిష్యత్తు ప్రయోగాలకు దోహదపడతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News