Saturday, April 5, 2025
Homeఇంటర్నేషనల్స్క్విడ్ గేమ్ నటుడు ఓ యోంగ్ సు‌కు ఏడాది జైలు శిక్ష.. ముసలోడే గాని..!

స్క్విడ్ గేమ్ నటుడు ఓ యోంగ్ సు‌కు ఏడాది జైలు శిక్ష.. ముసలోడే గాని..!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటుడు ఓ యోంగ్ సు లైంగిక వేధింపుల కేసులో ఏడాది జైలు శిక్ష పడింది. 2017లో ఓ మహిళపై లైంగికంగా ప్రవర్తించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆయనపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారమైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌లో ప్లేయర్ నంబర్ 1 పాత్ర ద్వారా గ్లోబల్‌గా గుర్తింపు పొందిన ఈ 80 ఏళ్ల నటుడిపై వచ్చిన ఈ తీర్పు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

- Advertisement -

కోర్టు విచారణ ప్రకారం, ఓ యోంగ్ సు 2017లో ఓ గ్రామీణ ప్రాంతంలో థియేటర్ ప్రదర్శన కోసం వెళ్లిన సమయంలో, అక్కడ ఓ మహిళను అనుచితంగా శారీరకంగా స్పర్శ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఈ సంఘటన కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైందని, ఆ ఘటన తర్వాత ఆమె భయంతో జీవించాల్సి వచ్చిందని న్యాయవాదులు కోర్టులో వాదించారు. తాజా విచారణలో న్యాయస్థానం బాధితురాలి వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకొని ఓ యోంగ్ సుకు ఒక సంవత్సరం జైలు శిక్షను ఖరారు చేసింది. అంతేగాక, గతంలో కూడా ఆయనపై ఇలాంటి ఆరోపణలు ఉన్నట్లు గుర్తించడంతో కోర్టు ఈ తీర్పును అమలు చేయాలని నిర్ణయించింది.

అయితే, ఓ యోంగ్ సు తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తన చర్యకు ఎటువంటి దురుద్దేశం లేదని, మహిళకు సహాయం చేయడం కోసమే ఆమె చేయిని పట్టుకున్నానని ఆయన వెల్లడించారు. పైగా, అప్పట్లోనే ఆమెకు క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. అయినప్పటికీ కోర్టు బాధితురాలి వాంగ్మూలాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ శిక్షను విధించింది.

ఓ యోంగ్ సు దక్షిణ కొరియా సినిమా పరిశ్రమలో 50 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ నటుడు. 2021లో వచ్చిన ‘స్క్విడ్ గేమ్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే, ఆయనపై వచ్చిన ఈ వివాదాస్పద తీర్పుతో సినీ ఇండస్ట్రీలో ఆయన భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News