మయన్మార్‌లో భారీ భూంకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. ఈ భూప్రకంపనలు కారణంగా పొరుగు దేశమైన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో కూడా తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బ్యాంకాక్‌లో ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

