Monday, November 17, 2025
Homeఇంటర్నేషనల్Nobel Prize 2025: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్.. 'మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్' అభివృద్ధికి పురస్కారం

Nobel Prize 2025: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్.. ‘మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్’ అభివృద్ధికి పురస్కారం

Nobel Prize in Chemistry for Metal-Organic Frameworks: 2025 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలు గెలుచుకున్నారు. సుసుము కితగావా (Susumu Kitagawa), రిచర్డ్ రాబ్‌సన్ (Richard Robson) మరియు ఒమర్ ఎం. యాఘీ (Omar M Yaghi) సంయుక్తంగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.

- Advertisement -

ALSO READ: Ken Griffin on H-1b: భారతీయ విద్యార్థులను అడ్డుకుంటే మనకే నష్టం.. అమెరికన్ బిలియనీర్ సంచలన వ్యాఖ్యలు

“మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్‌ల (Metal-Organic Frameworks – MOFs) అభివృద్ధి”కి గాను ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు 2025 నోబెల్ బహుమతిని ప్రదానం చేయాలని ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నిర్ణయించినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. ఈ విజేతలు ముగ్గురూ కలిసి 11 మిలియన్ల స్వీడిష్ క్రోన్స్ (భారత కరెన్సీలో సుమారు రూ. 10 కోట్లు) ప్రైజ్ మనీని పంచుకుంటారు.

నోబెల్ కమిటీ జ్యూరీ, విజేతల పని ప్రాముఖ్యతను వివరిస్తూ, ఈ ‘మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్‌లు’ను ఎడారి గాలి నుంచి నీటిని సేకరించడానికి, కార్బన్ డయాక్సైడ్‌ను బంధించడానికి, విషపూరిత వాయువులను నిల్వ చేయడానికి లేదా రసాయన ప్రతిచర్యలను వేగవంతం చేయడానికి (catalyse) ఉపయోగించవచ్చని పేర్కొంది.

ALSO READ: Nobel Prize: వైద్య శాస్త్రంలో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్‌ పురస్కారం

నోబెల్ కమిటీ ఫర్ కెమిస్ట్రీ ఛైర్ హైనర్ లింకే మాట్లాడుతూ, “మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్‌లు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి, కొత్త ఫంక్షన్లతో కూడిన అనుకూల (custom-made) పదార్థాల కోసం ఊహించని అవకాశాలను ఇవి తీసుకొస్తున్నాయి” అని తెలిపారు.

విజేతల వివరాలు:

  • సుసుము కితగావా (జపాన్): క్యోటో యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.
  • రిచర్డ్ రాబ్‌సన్ (యూకే/ఆస్ట్రేలియా): యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్‌లో అధ్యాపకుడు.
  • ఒమర్ ఎం. యాఘీ (జోర్డాన్/యూఎస్): యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.

రేపు (గురువారం) సాహిత్యంలో నోబెల్ బహుమతి, ఆపై శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి ప్రకటిస్తారు.

ALSO READ: Nobel Prize 2025: క్వాంటం మెకానిక్స్‌పై పరిశోధన.. భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పుర‌స్కారం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News