సోడా క్యాన్ పుల్ ట్యాబ్స్ మనం పడేస్తాం కదా..కానీ దాంతో కళ్లు చెదిరే డ్రెస్ డిజైన్ చేశారు ఓ డిజైనర్. అన్నా సుయిగంలాం అనే బ్యూటీ ఇప్పుడు ఈ డ్రెస్ లోనే వల్డ్ వైడ్ పాపులర్ అవుతున్నారు. మిస్ యూనివర్స్ థాంయ్లాండ్ 2022 కూడా అయిన అన్నా సోడా డ్రాట్ క్యాన్ పుల్-ట్యాబ్స్ తో తయారైన డ్రెస్ తో మెరిసిపోతున్నారు. ఈ బ్యూటీ క్వీన్ వేసుకున్న ఈవినింగ్ గౌన్ ను థాయ్ కంపెనీ అయిన Manirat డిజైన్ చేసింది. రీసైక్లబుల్ మెటీరియల్స్ తో ఇది తయారు చేయటం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని డిజైనర్ అరీఫ్ జెహ్వాగ్ చెబుతున్నారు.
- Advertisement -
అన్నా తండ్రి చెత్త ఏరుకునేవాడు కాగా, తల్లి వీధుల్లో చెత్త ఉడ్చే కార్మికురాలిగా పనిచేసేవారు. కాగా కొందరు అన్నా ఏకంగా గార్బేజ్ బ్యూటీ క్వీన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.