Friday, April 4, 2025
Homeఇంటర్నేషనల్Time 100 reader poll: టైమ్ 100 రీడర్ పోల్ లో నంబర్ 1గా షారూఖ్

Time 100 reader poll: టైమ్ 100 రీడర్ పోల్ లో నంబర్ 1గా షారూఖ్

కింగ్ ఖాన్ తాను నిజంగానే కింగ్ ఖాన్ అని బాలీవుడ్ కా బాద్షా అని మరోమారు నిరూపించుకున్నారు.  టైమ్ 100 రీడర్ పోల్ లో షారూఖ్ ఖాన్ తొలి స్థానంలో నిలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు.  మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పర్సనాలిటీల్లో ఓటింగ్ నిర్వహించిన టైమ్ మ్యాగజైన్ ఈ ఫలితాలను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సెరీనా విలియమ్స్, మార్క్ జుకర్ బర్గ్ వంటి వారిని తోసిరాజని షారూఖ్ ఈ ప్లేస్ లో నిలవటం హైలైట్.

- Advertisement -

ఇక షారూఖ్ తరువాతి స్థానం ఇరాన్ లో మహిళల హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నవారు నిలువగా, ఆతరువాతి స్థానాల్లో పలువురు ప్రముఖులు నిలిచారు.  వీరిలో ప్రిన్స్ హ్యారీ-మేఘన్, ఫుట్ బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ వంటివారున్నారు. 100 బాలీవుడ్ సినిమాల్లో నటించిన షారూఖ్, నాలుగేళ్ల గ్యాప్ తరువాత పఠాన్ తో బిగ్ హిట్ కొట్టి మార్కెట్లో తన సత్తా చాటుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News