Saturday, November 15, 2025
HomeTop StoriesTomato Rate in Pakistan: ఒక్కో టమాటా రూ.75 ఏంది సామీ.. తినాలా లేక చూసి...

Tomato Rate in Pakistan: ఒక్కో టమాటా రూ.75 ఏంది సామీ.. తినాలా లేక చూసి ఆనంద పడాల్సిందేనా..?

Pakistan Tomato Rates: దాయాది దేశం పాకిస్థాన్ లో కూరగాయలు, నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్కడ ద్రవ్యోల్బణం శివతాండవం చేసినట్లు రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో ప్రజలు కనీస ఆహార పదార్ధాలు కొనుక్కోవటం కూడా కలగా మారిపోతోంది. కూరగాయలు కూడా లగ్జరీ వస్తువుల్లా మారిపోవటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అక్కడ కేజీ టమాటా రేటు ఏకంగా రూ.600 పలుకుతోంది. అంటే ఒక్కో టమాటా రేటు దాదాపు 75 పాకిస్థానీ రూపాయలకు చేరింది.

- Advertisement -

ప్రజాగ్రహం పెరుగుతున్న వేళ దీనిపై అక్కడి పార్లమెంటులో కూడా చర్చ జరిగింది. ప్రజా ప్రతినిధులు టమాటా కొనటానికి కూడా లోన్స్ ఇవ్వాలంటూ చేసిన కామెంట్స్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. మరికొందరు ఒకప్పుడు భారత్ నుంచి తక్కువ రేటుకు టమాటాలను కొన్న రోజులను గుర్తుచేసుకుంటూ ప్రభుత్వాన్ని నింధిస్తున్నారు. ఈక్రమంలోనే పాక్ ఎంపీ తన చేతిలో ఒక టమాటా పట్టుకుని పార్లమెంటులో మాట్లాడుతూ దీనిని అక్కడి వరకు తీసుకురావటం చాలా కష్టమైందని ఒక్కోటి రూ.75 పలుకుతున్నట్లు చెప్పారు.

పాక్ ఆఫ్గన్ బోర్డర్ మూసివేత కారణంగా టమాటా రేట్లకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయని తేలింది. పాక్ ఆఫ్గన్ పై వైమానిక దాడులు చేసిన తర్వాత అక్టోబర్ 11 నుంచి బోర్డర్స్ క్లోజ్ అయ్యాయి. దీంతో దిగుమతులు తగ్గి టమాటాలకు కొరత ఏర్పడింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోవటంతో రోజుకు మిలియన్ డాలర్ల వరకు వ్యాపారం నిలిచిపోయి నష్టం జరుగుతోందని వెల్లడైంది. రెండు దేశాలు ఈ బోర్డర్ ద్వారా ఏటా 23 బిలియన్ డాలర్ల వరకు వ్యాపారం చేస్తుంటాయని వెల్లడైంది.

ప్రస్తుతం పాక్ టమాటాల కోసం ఎక్కువగా ఆఫ్గన్ పై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు మందులు, ధాన్యాలు, చక్కెర, మాంసం, డెయిరీ ఉత్పత్తులు కూడా ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యంలో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం పాక్ లో వెల్లుల్లి కేజీ 400, అల్లం కేజీ 750, బఠాణీ 500, ఉల్లి 120, కొత్తిమీర చిన్న కట్ట 50 పాకిస్థానీ రూపాయల వరకు పలుకుతున్నాయి. ఇది పాక్ ప్రజలకు జీవితాన్ని భారంగా మార్చేస్తోందని సోషల్ మీడియాలో కూడా ప్రజలు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad