London protest: నేపాల్ లో జరిగిన భారీ స్థాయి ఆందోళనలు మర్చిపోకముందే.. బ్రిటన్‌లో మరో నిరసస జరిగింది. అక్కడ భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. లక్ష మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. అదే సమయంలో జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మరో నిరసన కార్యక్రమం కూడా జరిగింది. ఈ క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేశారు. శనివారం సెంట్రల్ లండన్‌లో జరిగిన ఈ ర్యాలీ యూకే (UK) చరిత్రలోనే అతి పెద్దదని మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్యకర్త టామీ రాబిన్సన్ (Tommy Robinson) ఆధ్వర్యంలో ‘యునైట్ ది కింగ్‌డమ్’ ప్రదర్శన జరిగింది. అదే సమయంలో జాత్యాహంకారానికి వ్యతిరేకంగా ‘స్టాండ్ అప్ టు రేసిజమ్’ అనే మరో నిరసన కూడా చేపట్టారు. దీనిలో 5వేల మంది పాల్గొన్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపైకి వాటర్ బాటిళ్లు, పలు వస్తువులతో ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడినట్లు సమాచారం. వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Read Also: Bigg Boss Saturday Episode: సంజన కొంపముంచిన ఫ్రీబర్డ్.. రీతూ, తనూజాని కలిపిన నాగార్జున
అమెరికా, ఇజ్రాయెల్ జెండాల ప్రదర్శన
కాగా.. ఈ ప్రదర్శనల్లో అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కొందరు నిరసనకారులు ప్రదర్శించారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌ను విమర్శిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ‘వారిని తిరిగి పంపించేయండి’ అని వలస వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. మరికొంత మంది ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అని రాసి ఉన్న టోపీలు ధరించారు. లండన్‌లో జరిగిన ఈ ప్రదర్శనలు టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆయన అసలు పేరు స్టీఫెన్ యాక్ల్సీ లెన్నాన్. జర్నలిస్టుగా పనిచేస్తున్న రాబిన్సన్.. యూకే ప్రభుత్వంలోని అవినీతిని బయటపెడతానంటూ చాలాసార్లు పేర్కొన్నారు. ఆయనకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో సహా పలువురి ప్రముఖుల మద్దతు ఉంది. కాగా.. ఇటీవల జరిగిన ఈ ర్యాలీకి మస్క్ కూడా మద్దతు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో వీడియో విడుదల చేశారు. బ్రిటన్‌లోని ప్రజలు తమ హక్కులను వినియోగించుకోవడానికి భయపడుతున్నారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Read Also: Bigg Boss Saturday Episode: గుండు అంకుల్ బాడీ షేమింగా? రెడ్ ఫ్లవర్ కాదా? వీకడెక్కడ దొరికాడ్రా బాబు


