చైనా చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, ఇది “అంతర్జాతీయ వాణిజ్యంలో నైతిక తప్పిదం” అని అభివర్ణించారు. చైనా దుందుడుకు వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ, భారీ టారిఫ్‌లను ప్రకటించారు. అంతేకాకుండా, త్వరలో దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరగాల్సిన ఉన్నతస్థాయి సమావేశాన్ని కూడా రద్దు చేసుకునే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.
ALSO READ: USA Shooting: అర్ధరాత్రి రక్తపాతం: మిస్సిస్సిపీలో మాజీ విద్యార్థుల వేడుకలో కాల్పులు – నలుగురు మృతి!
స్టాక్ మార్కెట్లు పతనం..
ట్రంప్ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే అమెరికా స్టాక్ మార్కెట్లు తీవ్రంగా పతనమయ్యాయి. డౌ జోన్స్ సూచీ 900 పాయింట్లు పడిపోగా, ఎస్&పీ 500, నాస్‌డాక్ సూచీలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. ఇది గత ఆరు నెలల్లో మార్కెట్లలో నమోదైన అతిపెద్ద పతనం. ముఖ్యంగా, ఇరు దేశాల మధ్య వాణిజ్య పోరులో నలిగిపోతున్న ఎన్విడియా (Nvidia) వంటి టెక్ కంపెనీల షేర్లు 5% వరకు పడిపోయాయి.
అమెరికా “ద్వంద్వ ప్రమాణాలు”..
ట్రంప్ నిర్ణయంపై చైనా తీవ్రంగా స్పందించింది. అమెరికా “ద్వంద్వ ప్రమాణాలు” పాటిస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో విమర్శించింది. నిరంతరం అధిక టారిఫ్‌లతో బెదిరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికింది.
విశ్లేషకుల ప్రకారం, ట్రంప్ తన “డీల్‌మేకింగ్” దౌత్యంలో భాగంగానే ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, గతంతో పోలిస్తే చైనా ఇప్పుడు మరింత బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉందని, రేర్-ఎర్త్ ఖనిజాల రూపంలో బలమైన ఆయుధం వారి చేతిలో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలతో, ప్రపంచ వాణిజ్యం రాబోయే రోజుల్లో తీవ్ర అనిశ్చితిని ఎదుర్కోనుందని, క్రిస్మస్ సీజన్ ముందు సరఫరా గొలుసులు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ: India Afghanistan relation : భారత్ ను వెనకేసుకొచ్చిన ఆఫ్ఘనిస్తాన్.. మండిపడుతున్న పాకిస్థాన్


