Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Donald Trump : అమెరికా అధ్యక్షుడిని నన్నే అన్నిసార్లు అవమానిస్తారా..?

Donald Trump : అమెరికా అధ్యక్షుడిని నన్నే అన్నిసార్లు అవమానిస్తారా..?

United Nations: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితి (ఐరాస) పర్యటన సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగిందంటూ, వరుసగా జరిగిన మూడు అనుమానాస్పద ఘటనలను ఆయన “ట్రిపుల్ సాబోటేజ్”గా అభివర్ణించారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలపై సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు జరుపుతుందని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

- Advertisement -

ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగం తర్వాత ట్రంప్‌కు వరుసగా మూడు సమస్యలు ఎదురయ్యాయి. ట్రంప్ తన బృందంతో ఎస్కలేటర్‌పై వెళ్తుండగా అది పెద్ద శబ్దంతో నిలిచిపోయిందని, ఇది కచ్చితంగా కుట్రేనని ఆయన ఆరోపించారు. ఆయన ప్రసంగిస్తుండగా టెలిప్రాంప్టర్ మధ్యలోనే ఆగిపోయి నల్లగా మారిపోయింది.ఆ సమయంలో సౌండ్ సిస్టమ్ కూడా పనిచేయలేదని, తన భార్య మెలానియాకు కూడా ప్రసంగం వినిపించలేదని ట్రంప్ తెలిపారు.

ఈ ఘటనలు యాదృచ్ఛికంగా జరగలేదని, కచ్చితంగా కుట్ర కోణంలోనే జరిగాయని ట్రంప్ గట్టిగా నమ్ముతున్నారు. ఎస్కలేటర్ ఆగిపోయిన ఘటనకు సంబంధించిన సెక్యూరిటీ టేపులను భద్రపరచాలని, సీక్రెట్ సర్వీస్ వాటిని పరిశీలిస్తుందని ఆయన ఆదేశించారు.

అయితే, ట్రంప్ ఆరోపణలపై ఐరాస అధికారులు భిన్నమైన వివరణ ఇచ్చారు. ఎస్కలేటర్ ఆగిపోవడానికి అమెరికా ప్రతినిధి బృందంలోని ఒక వీడియోగ్రాఫర్ ప్రమాదవశాత్తు స్టాప్ బటన్‌ను నొక్కి ఉండవచ్చని ఐరాస ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ పేర్కొన్నారు. అలాగే, టెలిప్రాంప్టర్ నిర్వహణ బాధ్యత వైట్‌హౌస్‌దేనని, తమకు ఎలాంటి సంబంధం లేదని మరో అధికారి స్పష్టం చేశారు.

నిజానికి, ఐరాస ప్రస్తుతం తీవ్రమైన నిధుల కొరతతో సతమతమవుతోంది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా తరచూ ఎస్కలేటర్లు, లిఫ్టులను ఆపేస్తున్నారు. ఐరాసకు అతిపెద్ద దాత అయిన అమెరికా నుంచే నిధుల విడుదలలో జాప్యం జరగడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంక్షోభం, ట్రంప్ ఎదుర్కొన్న “ట్రిపుల్ సాబోటేజ్” ఆరోపణలకు మరింత చర్చకు దారితీసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad