Saturday, March 14, 2026
Homeఇంటర్నేషనల్Trump: పాక్ నాయకత్వంపై ట్రంప్ ప్రశంసలు.. అఫ్గాన్ వివాదంలో మధ్యవర్తిత్వానికి సిద్ధం!

Trump: పాక్ నాయకత్వంపై ట్రంప్ ప్రశంసలు.. అఫ్గాన్ వివాదంలో మధ్యవర్తిత్వానికి సిద్ధం!

Afghan conflict: అఫ్గానిస్థాన్-పాక్‌ దేశాల మధ్య సరిహద్దు వివాదం ముదిరింది. పరస్పరం దాడులు చేసుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రస్తుత నాయకత్వాన్ని ట్రంప్‌ కొనియాడారు.

- Advertisement -

మధ్యవర్తిత్వానికి సై అంటున్న ట్రంప్‌: ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు, అవసరమైతే తాను జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమని ట్రంప్ ప్రకటించారు.

Also read-India: భారత్‌కు షాక్.. కోడి మాంసం, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేధం!

పాక్ నేతలపై ప్రశంసలు: పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్‌లపై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. వారిద్దరినీ తాను ‘గొప్ప నాయకులు’గా భావిస్తానని, వారి పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాక్‌తో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆ దేశం ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. గత కొన్ని రోజులుగా అఫ్గానిస్థాన్ భూభాగం నుంచి జరుగుతున్న ఉగ్ర దాడులను నిరసిస్తూ పాక్ సైన్యం దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ పాక్‌కు మద్దతుగా మాట్లాడటం దౌత్యపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News