Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్White House : ట్రంప్ లేకుంటే అణుయుద్ధమే.. భారత్-పాక్​ల మధ్య నిప్పు రాజేసిన వైట్​హౌస్!

White House : ట్రంప్ లేకుంటే అణుయుద్ధమే.. భారత్-పాక్​ల మధ్య నిప్పు రాజేసిన వైట్​హౌస్!

Trump’s role in India-Pakistan conflict : అగ్రరాజ్యం అమెరికా మరోసారి పాత పాటే పాడుతోంది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధాన్ని ఆపింది తామేనంటూ డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలకు ఇప్పుడు శ్వేతసౌధం వంత పాడింది. అసలు ట్రంప్ గనుక అధ్యక్షుడిగా లేకపోతే, ఈపాటికి రెండు దేశాల మధ్య అణుయుద్ధమే జరిగి ఉండేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకే భారత్‌పై సుంకాలు విధించామంటూ మరో బాంబు పేల్చింది. ఇంతకీ వైట్‌హౌస్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటి..? దీని వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి..?

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మరోసారి హీరోగా నిలబెట్టే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగానే వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తిన సైనిక ఘర్షణను డొనాల్డ్ ట్రంప్ తన అద్భుతమైన వాణిజ్య వ్యూహాలతో, దౌత్యంతో నివారించారని ఆమె కొనియాడారు. “అమెరికా బలాన్ని ఉపయోగించి మన మిత్రదేశాలు, శత్రుదేశాల నుంచి గౌరవాన్ని ఎలా పొందాలో ట్రంప్‌కు బాగా తెలుసు. ఆయన గనుక లేకపోతే భారత్, పాక్ ఘర్షణ పెను అణుయుద్ధానికి దారితీసి ఉండేది” అని ఆమె వ్యాఖ్యానించారు.

ట్రంప్ పాత వాదన.. భారత్ ఖండన : నిజానికి, భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో తన మధ్యవర్తిత్వం ఉందని ట్రంప్ అనేకసార్లు, సుమారు 40 సార్లకు పైగా చెప్పుకున్నారు. 2019లో పుల్వామా దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరినప్పుడు, మే 10వ తేదీన ఇరు దేశాలు తన చొరవతోనే కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన ప్రకటించారు. అయితే, ఈ వాదనను భారత్ మొదటి నుంచి స్థిరంగా ఖండిస్తూనే వస్తోంది. ఏ దేశ మధ్యవర్తిత్వం లేకుండా, ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితంగానే కాల్పుల విరమణపై అవగాహన కుదిరిందని స్పష్టం చేస్తోంది. ఇటీవల పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. “ఆపరేషన్ సిందూర్”ను ఆపమని ఏ దేశ నాయకుడూ తమను కోరలేదని ఆయన తేల్చిచెప్పారు. అయినప్పటికీ, అమెరికా తన పాత పాటనే ఆలపిస్తుండటం గమనార్హం.

రష్యా కోసమే భారత్‌పై సుంకాల అస్త్రం : మరోవైపు, భారత్‌పై ట్రంప్ విధించిన 50కి పైగా సుంకాల వెనుక ఉన్న అసలు కారణాన్ని కూడా లీవిట్ బయటపెట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు మాస్కోపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే భారత్‌పై సుంకాలు విధించినట్లు ఆమె తెలిపారు. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా పుతిన్‌ను దారికి తేవాలన్నది ట్రంప్ పరిపాలన వ్యూహమని ఆమె వెల్లడించారు. ట్రంప్ అధికారంలో ఉంటే అసలు ఉక్రెయిన్-రష్యా యుద్ధమే మొదలయ్యేది కాదని, ఈ విషయాన్ని స్వయంగా పుతినే అంగీకరించారని ఆమె గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad