Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Trump News: ఇండియా పాక్ యుద్ధంలో 8 ఫైటర్ జెట్స్ కూలిపోయాయ్.. ట్రంప్ కొత్త లెక్కలు..

Trump News: ఇండియా పాక్ యుద్ధంలో 8 ఫైటర్ జెట్స్ కూలిపోయాయ్.. ట్రంప్ కొత్త లెక్కలు..

Trump On India-Pakistan conflict: అమెరికా వ్యాపార వేదికలో ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ భారత్-పాకిస్తాన్ యుద్ధం గురించి మరోసారి కొత్త వ్యాఖ్యలు చేశారు. మే నెలలో జరిగిన ఈ ఘర్షణలో ఏడు కాదు.. ఎనిమిది యుద్ధ విమానాలు కూల్చబడినట్లు స్పష్టం చేశారు. ఎనిమిదవ విమానం కూడా తీవ్రంగా దెబ్బతిందని.. అది కూడా కూలిపోయినట్లే పరిగణిస్తున్నట్లు చెప్పారు. యుద్ధం తనవల్లే ఆగినట్లు అనేకమాట్లు చెప్పుకున్న ట్రంప్ తాజాగా ఫైటర్ జట్ల డ్యామేజ్ గురించి చేసిన ఆసక్తికర కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

- Advertisement -

తాను మధ్యవర్తిత్వం చేసి అనేక యుద్ధాలు ఆపినట్లు మియామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరంలో బుధవారం ట్రంప్ చెప్పారు. “కోసోవో-సెర్బియా, కాంగో-రువాండా, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్ట్-ఇథియోపియా, ఆర్మేనియా-అజర్బైజాన్, కంబోడియా-థాయిలాండ్, భారత్-పాకిస్తాన్ ఇలా మెుత్తం 8 యుద్ధాలను తానే నిలువరించినట్లు ట్రంప్ క్లెడిట్ తీసుకున్నాడు. కొన్ని వివాదాలు దాదాపు 30 ఏళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి కొనసాగాయని.. వాటిని తాను గంటలోపే ఆపగలిగానని ట్రంప్ వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి నుంచి ఎటువంటి సహాయం లేకుండానే తాను ఇదంతా పూర్తి చేసినట్లు ట్రంప్ వెల్లడించారు.

భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో తాను వాణిజ్య ఒప్పందాల చర్చల్లో ఉండగా.. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమయిందని తెలుసుకొని వెంటనే చర్యలు తీసుకున్నానని ట్రంప్ వివరించారు. భారత్, పాకిస్తాన్ రెండూ అణు శక్తి కలిగిన దేశాలని.. శాంతి చర్చలతో యుద్ధాన్ని ఆపకపోతే వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయబోనని అప్పట్లో ఆ దేశ నేతలకు చెప్పినట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే 250 శాతం సుంకం విధిస్తాననటంతో ఎవ్వరూ దారికి వచ్చాయని చెప్పారు.

పన్నుల బెదిరింపు తర్వాత 48 గంటల్లోనే ఇండియా పాక్ యుద్ధం ఆపినట్లు నాకు ఫోన్ చేశారని ట్రంప్ తెలిపారు. టారిఫ్‌లు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. ఆర్థిక ఒత్తిడి ద్వారానే శాంతి వచ్చిందని గర్వంగా చెప్పారు. తాను ఈ విజయాన్ని మే 10 నుంచి అనేకసార్లు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే భారత్ మాత్రం మూడవ వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని ఎప్పటికీ అంగీకరించలేదని స్పష్టం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం యుద్ధవిరమణకు సంబంధించి ఎలాంటి బయట వ్యక్తుల జోక్యం జరగలేదని పునరుద్ఘాటించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad