Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Donald Trump: 'అణు' యుద్ధాన్ని ఆపింది నేనే... ట్రంప్ పాత పాటే.. భారత్ కొట్టిపారేసినా...

Donald Trump: ‘అణు’ యుద్ధాన్ని ఆపింది నేనే… ట్రంప్ పాత పాటే.. భారత్ కొట్టిపారేసినా ఆగని గొప్పలు!

Donald Trump conflict between India and Pakistan: అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే అందుకున్నారు. భారత్-పాకిస్థాన్‌ల మధ్య అణుయుద్ధం జరగకుండా అడ్డుపడింది తానేనంటూ మరోసారి సొంత డబ్బా కొట్టుకున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో అసలేం జరిగింది..? ట్రంప్ వాదనలో నిజమెంత..? ఈ వ్యాఖ్యలను భారత్ గతంలోనే ఎందుకు తీవ్రంగా ఖండించింది..? రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీకి ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యమేమిటి..?

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తనను తాను ప్రపంచ శాంతి దూతగా అభివర్ణించుకునే ప్రయత్నంలో, మరోసారి భారత్-పాకిస్థాన్‌ల ప్రస్తావన తెచ్చారు. గతంలో తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని, అది అణుయుద్ధం దిశగా వెళ్తుంటే తానే మధ్యవర్తిత్వం వహించి ఆపానని పునరుద్ఘాటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అలాస్కాలో జరగనున్న కీలక సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆరేడు విమానాలు కూలాయి.. నేనే ఆపాను” : తన అధ్యక్ష పదవీకాలం ఎంత శాంతియుతంగా గడిచిందో వివరిస్తూ ట్రంప్ గొప్పలకు పోయారు. “నా హయాంలో ఆరు నెలల వ్యవధిలోనే ఆరు ప్రధాన యుద్ధాలు ముగిశాయి. 37 ఏళ్లుగా సాగుతున్న ఓ యుద్ధం, 31 ఏళ్ల కాంగో-రువాండా ఘర్షణను ఆపడమే కాదు, శాంతిని నెలకొల్పాను,” అని చెప్పుకొచ్చారు. ఇక భారత్-పాక్ ఉద్రిక్తతల గురించి మాట్లాడుతూ, “భారత్-పాకిస్థాన్ మధ్య పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆరేడు విమానాలు కూలిపోయాయి. ఇరు దేశాలు అణుయుద్ధానికి సిద్ధమయ్యాయి. ఆ సమయంలో నేనే రంగంలోకి దిగి దాన్ని ఆపాను,” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ALSO READ: https://teluguprabha.net/international-news/pakistan-pok-floods-death-toll-khyber-pakhtunkhwa/

భారత్ ఏనాడో చెప్పింది.. “ఇది మాకు తెలుసు” : అయితే, ట్రంప్ వాదనలను భారత్ గతంలోనే తీవ్రంగా ఖండించింది. భారత్-పాకిస్థాన్ మధ్య వివాదాలు పూర్తిగా ద్వైపాక్షిక అంశాలని, ఇందులో మూడో వ్యక్తి మధ్యవర్తిత్వానికి ఆస్కారమే లేదని భారత విదేశాంగ శాఖ పలుమార్లు స్పష్టం చేసింది. ఇటీవలే భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్‌కు చెందిన ఐదు ఫైటర్ జెట్లతో పాటు ఓ పెద్ద విమానాన్ని కూడా భారత్ కూల్చివేసిందని వెల్లడించారు. ట్రంప్ ప్రస్తావిస్తున్నది ఈ ఘటన గురించే అయినా, ఇందులో ఆయన పాత్ర ఏమీ లేదన్నది భారత వాదన.

పుతిన్‌తో భేటీ.. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ :  రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే వ్యూహంలో భాగంగా ట్రంప్, శుక్రవారం అలాస్కాలో పుతిన్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం తొలి అడుగు మాత్రమేనని, అసలు చర్చ రెండో సమావేశంలో ఉంటుందని తెలిపారు. ఆ భేటీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఇతర యూరోపియన్ నేతలు కూడా హాజరుకావచ్చని సంకేతాలిచ్చారు. తాను అధ్యక్షుడిగా ఉండుంటే ఈ యుద్ధమే జరిగేది కాదని, ఇది పూర్తిగా ప్రస్తుత అధ్యక్షుడు “జో బైడెన్ యుద్ధం” అని ట్రంప్ మరోసారి విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad