HomeTop StoriesTiffany Trump: భారత పర్యటనలో ట్రంప్‌ కుమార్తె.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న ఫోటోలు..!

Tiffany Trump: భారత పర్యటనలో ట్రంప్‌ కుమార్తె.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న ఫోటోలు..!

Trump daughter on India visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిన్న కుమార్తె టిఫానీ భారత్‌లో పర్యటిస్తున్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఆమె శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం ప్రఖ్యాత స్వామి నారాయణ్‌ అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని శిల్పకళను చూసి టిఫానీ ట్రంప్‌ అబ్బురపడిపోయారు. ఆలయ ఆవరణలో 108 అడుగుల నీలకంఠ్‌ వర్ణీ విగ్రహం వద్ద ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తన సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా టిఫానీ ఆగ్రాకు వెళ్లనున్నారు. ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్‌ మహల్‌ను సందర్శించనున్నారు. అక్కడి నుంచి ఆమె రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో పర్యటించనున్నారు.

- Advertisement -

ఇది ఆమె వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ.. అమెరికా ప్రెసిడెంట్‌ కుమార్తె కావడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, టిఫానీ భారత్‌కు రావడం ఇది తొలిసారి కాదు. 2018లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా తండ్రితో పాటు టిఫానీ కూడా ఇక్కడకు వచ్చారు. ట్రంప్‌ రెండో భార్య మార్లా కుమార్తే టిఫానీ ట్రంప్‌.

Also read: Bank Holidays: కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. జూన్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏకంగా 11 రోజులు బంద్..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News