Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Trump On Pakistan: సీక్రెట్‌గా పాక్ అణ్వాయుధాలు పరీక్షిస్తోందన్న ట్రంప్.. తాము అదే దారిలో అంటున్న...

Trump On Pakistan: సీక్రెట్‌గా పాక్ అణ్వాయుధాలు పరీక్షిస్తోందన్న ట్రంప్.. తాము అదే దారిలో అంటున్న పెద్దన్న

Trump on Nuclear Testing: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అమెరికాలో 33 ఏళ్లుగా అమల్లో ఉన్న అణ్వాయుధ పరీక్షల నిషేధాన్ని ఎత్తివేసే నిర్ణయానికి అడ్డుగోడగా నిలిచిన విమర్శలపై స్పందించారు. రష్యా, చైనా పరీక్షలు చేస్తున్నాయి.. కానీ వాళ్లు దాని గురించి మాట్లాడరని అన్నారు ట్రంప్. అమెరికా ఓపెన్ సొసైటీ. మేము స్పష్టంగా మాట్లాడతాం. మేము పరీక్షించాల్సిందే.. ఎందుకంటే ఇతరులు కూడా పరీక్షిస్తున్నారు కాబట్టి అని పేర్కొన్నారు. పాకిస్థాన్ కూడా సీక్రెట్ గా న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేస్తోందంటూ ట్రంప్ చేసిన కామెంట్ షాక్ చేస్తోంది.

- Advertisement -

కేవలం ఉత్తర కొరియా మాత్రమే కాకుండా పాకిస్తాన్ కూడా తరచుగా అణుపరీక్షలు నిర్వహిస్తోందని ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. ఈ దేశాలు భూగర్భంలో గోప్యంగా పరీక్షలు నిర్వహిస్తాయి కాబట్టి ప్రపంచానికి పూర్తి వివరాలు అందటం లేదు. చూసేవాళ్లకు అవి స్వల్ప కంపనంలా మాత్రమే అనిపించవచ్చు.. కానీ వాళ్లు శాస్త్రపరమైన పరీక్షలు కొనసాగిస్తున్నారంటూ ట్రంప్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఈ వ్యాఖ్యల్లో భారతదేశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం.

వాస్తవానికి భారత్ ఎప్పటికీ అణు నిరోధక విధానానికి కట్టుబడి ఉన్న దేశంగా అంతర్జాతీయస్థాయిలో నమ్మకం పొందింది. 1998లో పోఖ్రాన్ -II పరీక్షల తరువాత భారత్ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని ఆవిష్కరించినప్పటికీ, చట్టబద్ధమైన, పారదర్శక విధానానికి కట్టుబడి ఉన్న సంగతి తెలిసిందే. కానీ పాక్ మాత్రం గోప్యంగా అణ్వాయుధాల అభివృద్ధి చేస్తోందని, వాటిని పరీక్షిస్తోందని ట్రంప్ కామెంట్స్ చెబుతున్నాయి. 1971 భారత-పాకిస్తాన్ యుద్ధం తరువాత భారత సైనిక శక్తిని సమతుల్యం చేయాలనే ఉద్దేశ్యంతో అప్పటి ప్రధానమంత్రి జుల్ఫికార్ అలీ భుట్టో ఆధ్వర్యంలో అణు కార్యక్రమాన్ని ప్రారంభించింది. విదేశీ నెట్వర్క్‌ల మద్దతుతో 1980–1990 దశ‌కాల్లో రహస్య పరీక్షలు జరిపి, చివరికి 1998 మే 28న బలూచిస్తాన్‌లోని ఛాగై ప్రాంతంలో అధికారిక అణుపరీక్షలు నిర్వహించింది.

ఇప్పటికీ పాకిస్తాన్ అణ్వాయుధాల భద్రతపై అంతర్జాతీయ వర్గాల్లో సందేహాలు కొనసాగుతున్నాయి. టెర్రర్ గ్రూపులు, అంతర్గత రాజకీయ అస్థిరత వంటి అంశాల వల్ల ఈ ఆయుధాలు సురక్షితంగా ఉన్నాయా అనే ప్రశ్నలకు జవాబు లభించటం లేదు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలో, “బాధ్యతలేని, రోగ్ దేశమైన పాకిస్తాన్‌లో అణ్వాయుధాలు సురక్షితమేనా?” అని ప్రశ్నించారు. మెుత్తానికి ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా అణ్వాయుధ విధానానికి కొత్త మలుపు తీసుకువచ్చే అవకాశం ఉంది. అమెరికా ఈ దిశలో అడుగులు వేయడం భవిష్యత్తు జియోపాలిటిక్స్‌ను ప్రభావితం చేయవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad