H1B Fee Waiver: హెచ్1బి వీసా కొత్త నిబంధనల్లో లక్ష డాలర్లు ఫీజును మినహాయించే అవకాశాలు చాలా కీలకమైన రంగాలకు మాత్రమే ఇవ్వబడ్డా. ఇటువంటి మినహాయింపులు ఇచ్చే అధికారాన్ని “హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ” శాఖకు ట్రంప్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ శాఖ ఆధ్వర్యంలో అమెరికాకు అత్యవసరమైన, జాతీయ ప్రయోజనం కోసం పనిచేసే H1B ఉద్యోగాలకు భారీ ఫీజు నుంచి మినహాయింపు నిర్ణయిస్తారు.
మినహాయింపు పొందే ఉద్యోగాలు..
హెచ్1బి నిబంధనల ప్రకారం హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అమెరికా జాతీయ ప్రయోజనాలు, భద్రత, సంక్షేమం వంటి అంశాలను దృష్టిలో ఉంటుకుని కొన్ని ఉద్యోగాలకే ఈ మినహాయింపు అమలు అవుతుంది.
1. ఆరోగ్య సేవలు: ఆరోగ్య సంక్షోభాలు, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీస్, మెడికల్ రిసెర్చ్ ద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చే పరిశోధనలకు ఫీజు నుంచి మినహాయింపు.
2. డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ: అమెరికా నేషనల్ సెక్యూరిటీకి అవసరమైన డిఫెన్స్, సైబర్-సెక్యూరిటీ ఉద్యోగాల్లో పనిచేయటానికి వచ్చే విదేశీ ఉద్యోగులకు వీసా ఫీజుపై ఊరట.
3. STEM రిసెర్చ్ & ఇన్నోవేషన్: అమెరికాలో అందుబాటులో లేని అత్యున్నత శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, టెక్ పరిశోధకులకు హెచ్1బి వీసా ఫీజు నుంచి ఉపశమనం.
4. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, ఏరోస్పేస్: మౌలిక సదుపాయాలు, ఎనర్జీ, అంతరిక్ష పరిశ్రమలో నిర్దిష్ట పాత్రల్లో వచ్చే విదేశీ టాలెంట్ కు ఊరట.
5. హై స్కిల్, హై పే: ఎక్కువ వేతనాలు, అత్యధిక ప్రతిభ ఉన్న విదేశీ ఉద్యోగాలకు నో ఫీజు.
హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ శాఖకు డిస్క్రిషనరీ ఆధారం మీద ఉద్యోగపు జాతీయ ప్రయోజనం, అమెరికా భద్రతకు ముప్పు లేదని నిర్ధారించినపుడు, లక్ష డాలర్ల ఫీజు మినహాయింపు ధృవీకరిస్తారు. ఇందుకోసం నియమించుకుంటున్న కంపెనీలు తగిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఐటీ


