Sunday, November 16, 2025
Homeఇంటర్నేషనల్India-Russia Oil: రష్యా చమురుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. భారత్ ఏమంటోంది?

India-Russia Oil: రష్యా చమురుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.. భారత్ ఏమంటోంది?

India-US Trade Relations: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్… భారత్-రష్యా బంధంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తోందన్న వార్తలను స్వాగతించిన ఆయన, అదే సమయంలో వాణిజ్య సుంకాలపై తన పాత పల్లవిని అందుకున్నారు. ఈ పరిణామం అంతర్జాతీయ రాజకీయ, వాణిజ్య వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే, ట్రంప్ మాటల్లో నిజమెంత..? చమురు విషయంలో భారత్ అధికారిక వైఖరి ఏంటి…? అసలు తెరవెనుక ఏం జరుగుతోంది..? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నాయి.

- Advertisement -

ట్రంప్ ఏమన్నారంటే:

అమెరికాలో విలేకరులతో మాట్లాడుతూ, రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను ఆపివేస్తోందన్న వార్తలపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. “భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనడాన్ని ఆపేస్తుందని వింటున్నాను. ఇది నిజమైతే చాలా మంచి విషయం. అయితే, ఆ వార్తలు నిజమో కాదో నాకు కచ్చితంగా తెలియదు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం,” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటల ద్వారా ఒకవైపు భారత్ నిర్ణయాన్ని ప్రశంసిస్తూనే, మరోవైపు దానిపై తనకు పూర్తి స్పష్టత లేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు.

ALSO READ: https://teluguprabha.net/international-news/a-new-frontier-for-extremist-recruitment/

మళ్ళీ సుంకాల గొడవ:

చమురు అంశాన్ని ప్రస్తావించిన ట్రంప్, వెంటనే భారత్‌తో ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలను మరోసారి గుర్తుచేశారు. “భారతదేశంతో మా వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి,” అని చెబుతూనే సుంకాల అంశాన్ని లేవనెత్తారు. “ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. కొన్ని వస్తువులపై 100%, 150%, లేదా 175% కంటే ఎక్కువ సుంకాలు ఉన్నాయి,” అని ట్రంప్ ఆరోపించారు.

ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడే అయినప్పటికీ, వాణిజ్యపరంగా భారత్ అమెరికాతో సరిగ్గా వ్యవహరించడం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. “వారు (భారత్) మనకు చాలా అమ్ముతారు, కానీ మనం వారికి ఎక్కువగా అమ్మలేకపోతున్నాం. దీనికి కారణం భారత్ విధించే అధిక టారిఫ్‌లే,” అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం సుంకాలను తగ్గించేందుకు భారత్ సిద్ధంగా ఉందని, చర్చలు జరుగుతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ALSO READ: https://teluguprabha.net/international-news/india-halts-f35-deal-us-russia-defense-relations/

భారత్ దీటైన స్పందన:

ట్రంప్ వ్యాఖ్యలు, మీడియాలో వస్తున్న ఊహాగానాలపై భారత ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం మాట్లాడుతూ ఈ నివేదికలను కొట్టిపారేశారు. “భారతీయ చమురు కంపెనీలు రష్యన్ చమురు దిగుమతులను నిలిపివేసినట్లు వచ్చిన మీడియా నివేదికల గురించి మాకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అవి కేవలం ఊహాగానాలు మాత్రమే,” అని ఆయన తేల్చి చెప్పారు.

భారత్ తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే ఇంధన నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు. “మన దేశం తన ఇంధన భద్రత, అవసరాలకు పెద్దపీట వేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ పోకడలు, ప్రపంచ పరిస్థితులను నిశితంగా గమనిస్తూ, దేశ ప్రయోజనాలకే అనుగుణంగా చమురు కొనుగోళ్లు జరుగుతాయి,” అని జైస్వాల్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad