Trump massive warning to Iran: ఇరాన్‌తో ఇటీవల చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆ దేశంపై విరుచుకుపడ్డారు. ఈ రోజు రాత్రి ఇరాన్‌పై మరింత తీవ్రంగా దాడులు చేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తుర్కియేలో జరుగుతున్న నాటో సదస్సులో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒప్పందాల అమలు విషయంలో ఇరాన్ తీరు అస్సలు బాగాలేదన్నారు. అందుకే, నేడు మరోసారి ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు.
Also Read: Telangana Housing Board: లోగో కొట్టు.. లక్ష పట్టు.. తెలంగాణ హౌసింగ్ బోర్డు వినూత్న ప్రయోగం
గత రాత్రి 28 నౌకలను ధ్వంసం చేశాం..
ఇదిలా ఉంటే, గత రాత్రి అమెరికా దళాలు జరిపిన దాడుల్లో 28 ఇరాన్ నౌకలను ధ్వంసం చేశామని ట్రంప్ పేర్కొన్నారు. మరిన్ని నౌకలను నాశనం చేస్తామని, అవసరమైతే విద్యుత్ గ్రిడ్, నీటి సదుపాయాలను లక్ష్యంగా దాడులు కొనసాగిస్తామని హెచ్చరించారు. అయితే, అలాంటి చర్యలు అవసరం అవుతాయని తాను భావించడం లేదన్నారు. అంతేకాదు, ఇరాన్ చుమురు ఎగుమతులకు జీవనాడిగా ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. హర్మూజ్ జలసంధిలో దిగ్బంధనాన్ని అమెరికా తిరిగి కొనసాగించే అవకాశమూ ఉందన్నారు. అయితే, అది ఇరాన్‌కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

