Trump Comments On Indian Tech Workers: “చైనాలో మీ ఫ్యాక్టరీలు.. భారతీయులకు మీ ఉద్యోగాలు.. ఇక్కడ అమెరికన్లకు మాత్రం మొండిచెయ్యి.. ఇక ఆ రోజులు ముగిశాయి,” అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్య టెక్ కంపెనీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘అమెరికా ఫస్ట్’ నినాదాన్ని మరోసారి గట్టిగా వినిపిస్తూ, భారతీయ ఉద్యోగులను నియమించుకోవడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసలు ట్రంప్ ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడారు..? ఆయన ఆగ్రహానికి కారణమేంటి..? దీని ప్రభావం భారతీయ ఉద్యోగులపై ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళితే:
న్యూయార్క్‌లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సదస్సులో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్, అమెరికా టెక్ కంపెనీల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధస్సుకు సంబంధించి మూడు కీలక కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు.
ALSO READ:https://teluguprabha.net/international-news/china-destroys-buddhist-stupas-tibet/
అమెరికా టెక్ పరిశ్రమ “రాడికల్ గ్లోబలిజం” (తీవ్ర ప్రపంచీకరణ)ను అనుసరిస్తోందని, ఇది లక్షలాది మంది అమెరికన్లకు చేసిన ద్రోహంతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు.
“మన అతిపెద్ద టెక్ కంపెనీలు చాలా వరకు చైనాలో ఫ్యాక్టరీలు కడుతున్నాయి. కానీ, భారతీయులను ఉద్యోగులుగా పెట్టుకుంటున్నాయి, ఐర్లాండ్‌లో పన్నులు కట్టి లాభాలు గడిస్తున్నాయి. ఇవన్నీ మీకు తెలుసు. కానీ, అదే సమయంలో ఇక్కడ తమ సొంత పౌరులను, అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. అందుకే చెబుతున్నా.. అధ్యక్షుడు ట్రంప్ పాలనలో ఆ రోజులు పోయాయి,” అని ట్రంప్ గట్టిగా హెచ్చరించారు. “మీరు అమెరికాను మొదటి స్థానంలో నిలపాలి. మేము అడుగుతున్నది అదే,” అంటూ టెక్ కంపెనీలకు ఆయన స్పష్టమైన సందేశం పంపారు.
ALSO READ: https://teluguprabha.net/international-news/us-fertility-rate-decline-historic-low/
డోనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన మూడు కీలక ఉత్తర్వులు..
AI అభివృద్ధి కోసం వైట్ హౌస్ కార్యాచరణ ప్రణాళిక:
దేశీయ AI పరిశ్రమకు మద్దతు ఇచ్చేందుకు జాతీయ స్థాయిలో సమన్వయ ప్రణాళిక. అమెరికాలో తయారైన AI టెక్నాలజీ ప్యాకేజీల ఎగుమతిని ప్రోత్సహించడం. విదేశాల్లో పెట్టుబడులు పెట్టే అమెరికన్ కంపెనీలపై ట్రంప్ విమర్శలు చేయడం ఇదే మొదటిసారి కాదు. యాపిల్ సంస్థ ఐఫోన్లను భారత్‌లో లేదా మరే ఇతర దేశంలో ఉత్పత్తి చేసినా, 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని గత మే నెలలో ఆయన స్పష్టం చేసిన సంగతి విదితమే. తాజా వ్యాఖ్యలతో ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని తాను ఎంత కఠినంగా అమలు చేయాలనుకుంటున్నారో డోనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు.


