Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Donald Trump: పాక్‌తో ట్రంప్ చమురు దోస్తీ.. భారత్‌కు వాణిజ్య కత్తి!

Donald Trump: పాక్‌తో ట్రంప్ చమురు దోస్తీ.. భారత్‌కు వాణిజ్య కత్తి!

US-Pakistan Oil Deal: శత్రువులను ఒక చేత్తో బాది, అదే సమయంలో మరో చేత్తో స్నేహపూర్వకంగా పలకరించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నైజం. భారత్‌పై భారీ సుంకాల కొరడా ఝుళిపించిన కొన్ని గంటల్లోనే, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో కీలక చమురు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించి ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించారు. ఏదో ఒక రోజు పాకిస్థాన్ నుంచే భారత్ చమురు కొనుగోలు చేయొచ్చు” అని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు కారణమయ్యాయి.  

- Advertisement -

భారత్‌పై సుంకాల వేటు.. పాక్‌కు స్నేహహస్తం:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతా ద్వారా సంచలన ప్రకటనలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత దిగుమతులపై ఆగస్టు 1 నుంచి 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే మరో బాంబు పేల్చారు. పాకిస్థాన్‌తో ఒక చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నామని, ఆ దేశంలోని అపారమైన చమురు నిల్వలను వెలికితీయడానికి అమెరికా సహాయం చేస్తుందని తెలిపారు. “పాకిస్థాన్‌తో ఒక ఒప్పందం చేసుకున్నాం. అక్కడి భారీ చమురు వనరులను అభివృద్ధి చేయడానికి అమెరికా, పాకిస్థాన్ కలిసి పనిచేస్తాయి. ఎవరు చెప్పగలరు, ఒకరోజు భారత్‌కు పాకిస్థాన్ చమురును అమ్మవచ్చేమో” అని ట్రంప్ చేసిన పోస్ట్ ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ALSO READ: https://teluguprabha.net/international-news/quad-nations-declare-strategy-to-counter-chinas-rare-earth-dominance/

రష్యా సాకు.. భారత్‌పై కక్ష సాధింపు:

భారత్‌పై సుంకాలు విధించడానికి ట్రంప్ ప్రధానంగా రెండు కారణాలు చూపుతున్నారు. మొదటిది, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న తరుణంలో భారత్ ఆ దేశం నుంచి చమురు, సైనిక పరికరాలు కొనుగోలు చేయడం. రెండవది, అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందని, దీనివల్ల అమెరికాకు భారీ వాణిజ్య లోటు ఏర్పడుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రధాని మోదీ తనకు మిత్రుడే అయినప్పటికీ, దేశ ప్రయోజనాలే ముఖ్యమని ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాక, అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బ్రిక్స్ కూటమిలో భారత్ సభ్యదేశంగా ఉందని, ఈ కూటమి డాలర్‌పై దాడి చేస్తోందని కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. వారం రోజుల్లో సుంకాలపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు.

పాక్ చమురు నిల్వలు.. వాస్తవమెంత:

పాకిస్థాన్‌లో భారీ చమురు నిల్వలు ఉన్నాయనే వాదన కొత్తదేమీ కాదు. గతంలో పలుమార్లు ఈ ప్రచారం జరిగినప్పటికీ, వాటిని వెలికితీసే ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు అమెరికా లాంటి అగ్రరాజ్యం నేరుగా రంగంలోకి దిగుతున్నట్లు ట్రంప్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భాగస్వామ్యానికి నేతృత్వం వహించే చమురు కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నామని ట్రంప్ చెప్పడం ఈ ఒప్పందంపై ఆయనకున్న పట్టుదలను సూచిస్తోంది. అయితే, భౌగోళికంగా, రాజకీయంగా అనేక సవాళ్లు ఉన్న పాకిస్థాన్‌లో ఈ ప్రాజెక్టు ఎంతవరకు విజయవంతమవుతుందనేది వేచి చూడాలి.

ALSO READ: https://teluguprabha.net/international-news/donald-trump-imposed-25-percentage-tariffs-on-india/

అమెరికా ఫస్ట్.. మిత్రులైనా తగ్గేదేలే:

ఈ పరిణామాలన్నీ తన “అమెరికా ఫస్ట్” విధానంలో భాగమేనని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. దక్షిణ కొరియా వంటి మిత్రదేశాలతో కూడా వాణిజ్య చర్చలు జరుపుతున్నామని, ఆ దేశంపై కూడా 25% సుంకాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. అనేక దేశాలు అమెరికాతో వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి ముందుకు వస్తున్నాయని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad