Thursday, January 30, 2025
Homeఇంటర్నేషనల్Modi-Trump: ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికాకు వస్తారు: ట్రంప్

Modi-Trump: ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికాకు వస్తారు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్(Trump) బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రధాని మోదీ(PM Modi) సోమవారం తొలిసారి ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య స్నేహం, వ్యూహాత్మక సంబంధాల పటిష్టతకు సంబంధించిన పలు అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా మోదీని ట్రంప్ వైట్ హౌస్‌కు ఆహ్వానించారు.

- Advertisement -

దీనిపై ట్రంప్ మాట్లాడుతూ.. భారత ప్రధాని మోదీతో సుదీర్ఘంగా మాట్లాడానని.. భారత్‌తో అమెరికాకు మంచి అనుబంధం ఉందన్నారు. వచ్చే నెలలో మోదీ అమెరికాకు రావొచ్చు అంటూ తెలిపారు.అలాగే అక్రమ వలసదారుల అంశంపైనా మోదీతో చర్చించానని.. అక్రమంగా వచ్చిన భారతీయులను చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించే విషయంలో భారత్ సరియైన నిర్ణయం తీసుకుంటుందని విశ్వసిస్తున్నా అంటూ పేర్కొన్నారు.

కాగా డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఎప్పటి నుంచో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ గతంలో అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో తన చివరి విదేశీ పర్యటన భారత్‌లోనే చేపట్టారు. అలాగే మోదీ కూడా అమెరికాలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News