Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Trump Tariffs: సినీ రంగంపై పెద్ద బాంబు పేల్చిన ట్రంప్‌.. త్వరలో 100 శాతం సుంకాలు.!

Trump Tariffs: సినీ రంగంపై పెద్ద బాంబు పేల్చిన ట్రంప్‌.. త్వరలో 100 శాతం సుంకాలు.!

Trump Tariffs On Movie Industry: ఇప్పటికే భారత ఎగుమతులపై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం భారతీయ చిత్రాలపై భారీ ప్రభావం చూపనుంది. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై సుంకాలు వందశాతం సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. కాగా, అమెరికాలో నిర్మించే చిత్రాలను మినహాయించారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/international-news/bangladesh-khagrachari-gang-rape-clashes-tribal-violence-2025/

‘అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై నూరు శాతం సుంకాలు విధించనున్నాం. చిన్న పిల్లాడి నుంచి మిఠాయిని దొంగిలించినట్లు మా సినిమా నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలించాయి. కాలిఫోర్నియాలో బలహీన, అసమర్థత గవర్నర్‌ వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ దీర్ఘకాలిక సమస్యను నూరు శాతం సుంకాలు విధించడం ద్వారా పరిష్కరిస్తాం. తద్వారా అమెరికాను మరోసారి అగ్రస్థానంలో నిలుపుతాం.’ అని ‘ట్రూత్‌’ సోషల్‌ ఖాతాలో ట్రంప్‌ పేర్కొన్నారు. 

Also Read: https://teluguprabha.net/international-news/freedom-slogans-echo-in-pok-amidst-crackdown-and-massive-demonstrations/

అయితే ఈ టారిఫ్‌లు ఎప్పటి నుంచి, ఎలా విధిస్తారు అనే దానిపై స్పష్టత లేదు. వైట్‌ హౌస్‌ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల కాలంలో సినిమా, టెలివిజన్‌ నిర్మాణం హాలీవుడ్‌ నుంచి యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాలకు తరలిపోతోంది. ఆయా దేశాలు పన్ను ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో.. షూటింగ్‌ ఖర్చు తగ్గించుకోవడం కోసం ఆయా దేశాల్లోని ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో సినిమా షూటింగులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. అమెరికాలో భారతీయ సినిమాలు పెద్ద సంఖ్యలో విడుదలవుతుంటాయి. తెలుగు సినిమాలకు సైతం అక్కడ ఫుల్‌ క్రేజ్‌ ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ నిర్ణయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీపై సైతం ప్రభావం పడనుంది. అక్కడ సినిమా విడుదల చేయాలంటే ఇకపై వందశాతం పన్ను చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad