Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్We have lost Indi to China: అంతా అయిపోయింది..భారత్‌కు దూరమయ్యాం

We have lost Indi to China: అంతా అయిపోయింది..భారత్‌కు దూరమయ్యాం

Trump on India: అమెరికా అధ్యక్షుడు భారత్‌ను చేజేతులా దూరం చేసుకున్నామని ఒప్పుకున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయనే అర్థం వచ్చేలా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము భారత్‌, రష్యాలకు దూరమైనట్లే అని నిర్వేదంతో ఉన్నారు. చైనా షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో భారత ప్రధాని మోడీ, రష్యా ప్రధాని పుతిన్‌, చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌లు కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేసిన ట్రంప్‌.. ఆ మూడు దేశాలకు ఉజ్వల భవిష్యత్తు కలిగి ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్రూత్‌లో పోస్ట్ చేశారు.

- Advertisement -

‘భారత్‌, రష్యాలను చైనాకు జార విడుచుకున్నట్లు కనిపిస్తోంది. ఆ మూడు దేశాలకు ఉజ్వల, సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నా’ అని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌లో వ్యంగ్యంగా పోస్టు చేశారు.

అయితే భారత్, రష్యాలను చైనాకు కోల్పోయినట్లు రాసుకొచ్చిన ట్రంప్.. చైనాను మోసకారి దేశం (డీపెస్ట్, డార్కెస్ట్) అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.

ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్‌ విరుచుకుపడుతున్న వేళ.. తియాన్‌జిన్‌ వేదికగా జరిగిన ఎస్‌సీవో సదస్సులో రష్యా, చైనా, భారత్‌ అధినేతలు ఒకే వేదికపై కనిపించడంతో నిద్ర కరువైనట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై చర్చించిన వీరు.. తామంతా ఏకతాటిపై ఉన్నట్లు సంకేతాలివ్వడంతో ట్రంప్‌లో భయం మొదలైనట్లు తెలుస్తోంది. భారత్, చైనా, రష్యా అధినేతల సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ట్రంప్‌ తీరువల్లే ఆ మూడు దేశాలు ఒక్కటయ్యాయనే వాదన కూడా అమెరికాలో పెద్ద ఎత్తున వినిపించింది. ఈ నేపథ్యంలో తమకు మిత్ర దేశంగా ఉన్న భారత్‌ దూరమైనట్లు ట్రంప్‌ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.

కాగా ట్రంప్ తాజా పోస్ట్‌పై అప్పుడే ఎలాంటి కామెంట్లు చేయబోమని భారత విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘ఆ పోస్టుపై ఇప్పుడే నేనేమీ వ్యాఖ్యలు చేయను’అని అన్నారు.

చైనా, రష్యా, బ్రెజిల్, భారత్‌లు టారిఫ్‌ల పేరుతో తమను చంపేస్తున్నాయని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే భారత్ అత్యధికంగా సుంకాలు విధిస్తున్న దేశమని ఆరోపించారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసిందన్న ఆక్రోశంతో ట్రంప్ భారత్‌పై 50శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ గట్టిగానే అమెరికాకు షాక్ ఇచ్చింది. వ్యూహాత్మకంగా చైనా, రష్యాలకు దగ్గరైంది. ఈ నేపథ్యంలో చైనాలో జరిగిన షాంఘై ఆర్థిక సహకరా సంస్థ సదస్సుకు ప్రధాని మోడీ హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad