Tuesday, December 9, 2025
Homeఇంటర్నేషనల్Shooting near White House: వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పులతో ట్రంప్‌ అలర్ట్‌.. గ్రీన్ కార్డ్ హోల్డర్లపై...

Shooting near White House: వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పులతో ట్రంప్‌ అలర్ట్‌.. గ్రీన్ కార్డ్ హోల్డర్లపై స్పెషల్‌ ఫోకస్

Trump Special focus on green card holders after shooting near White House: అగ్రరాజ్యం అమెరికా పరిపాలనా కేంద్రం వైట్ హౌస్‌ దగ్గర జరిపిన కాల్పులతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. అమెరికాలో గన్ కల్చర్ సర్వసాధారణం అయినప్పటికీ వైట్ హౌస్ దగ్గర్లోనే కాల్పులు జరిగేసరికి భద్రతా విభాగాలు సీరియస్‌గా తీసుకున్నాయి. దీంతో అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌పై ఫోకస్‌ పెట్టినట్లు తెలిస్తోంది. ఈ క్రమంలో ఆఫ్గాన్‌తో సహా మరో 18 దేశాలకు చెందిన గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్ల పౌరసత్వంపై సమీక్షించనున్నట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్‌, ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జోసెఫ్‌ ఎడ్లో తెలిపారు. కాగా, ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందే 12 దేశాలపై నిషేధాన్ని విధించారు. అందులో అఫ్గానిస్థాన్‌, ఇరాన్‌, యెమెన్‌, మయన్మార్‌, చాద్‌, కాంగో, ఈక్వెటోరియల్‌ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్‌ దేశాలు ఉన్నాయి. మరో ఏడు దేశాలపై కూడా పాక్షికంగా నిషేధం విధించారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/jagga-reddy-vs-lakshman-comments/

గ్రీన్‌ కార్డు ఇంటర్వ్యూలకు పిలిచి అరెస్ట్..

ట్రంప్‌ ఇమిగ్రేషన్‌ చట్టాలను కఠినతరం చేస్తూ వలసదారులపై అనేక ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్‌ గ్రీన్ కార్డుల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తున్నారు. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూల కోసమని పిలిచి, వారిని భద్రతాధికారులు అరెస్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. శాన్‌డియాగోలోని యూఎస్‌ సిటిజన్‌షిప్‌, ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(USCIS) కార్యాలయంలో గ్రీన్‌ కార్డు ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఓ వ్యక్తితో పాటు వారి అమెరికన్‌ భాగస్వామిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. వీసా గడువు ముగిసినా కూడా ఇంకా దేశంలోనే ఉన్న వారినే లక్ష్యంగా చేసుకుని ఈ అరెస్ట్ లను చేస్తున్నారని సమాచారం. దీని కంటే ముందు ఐదుగురు క్లయింట్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరందరికీ ఎలాంటి నేర చరిత్రా లేదని.. గతంలోనూ ఎలాంటి అరెస్టులు జరగలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా వారు ఇంకా దేశంలోనే ఉన్నారనే కారణంతో ఈ అరెస్టులు చేశారన్నారు. అయితే, వీరంతా అమెరికా పౌరులను పెళ్ళి చేసుకున్నవారు కావడం విశేషం. కాల్పులు చేసిన నిందితుడు ఆఫ్గానిస్థాన్‌కు చెందిన రెహ్మనుల్లా లఖన్‌వాల్‌ అని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెల్లడించారు. 2021లో ఆఫ్గాన్లకు ఇచ్చిన స్పెషల్ వీసాపై అతను అమెరికాకు వచ్చినట్లు పేర్కొన్నారు. కాల్పుల్లో నిందితుడికి గాయాలు కావడంతో అతడిని ఆస్పత్రికి తరలించామని.. అయితే అతడు ఒక్కడే ఈ దాడికి పాల్పడ్డట్లు దర్యాప్తు అధికారులు తేల్చి చెప్పారు. వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పులు జరగడంతో యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (USCIS) సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫ్గానిస్థాన్ ఇమిగ్రేషన్ దరఖాస్తులు వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. అమెరికన్ల భద్రతే తమకు ముఖ్యమని తెలిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు నేషనల్ గార్డులు కూడా మృతి చెందినట్లు వెస్ట్ వర్జీనియా గవర్నర్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News