Trump New Letters Sent Deadline Extension Update: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్య విధానంలో మరోసారి సంచలనం సృష్టించారు. ప్రతీకార సుంకాల ( retaliatory tariffs) విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గబోమని సంకేతాలిస్తూ, కొత్త టారిఫ్ రేట్లను తెలియజేస్తూ వివిధ దేశాలకు లేఖలు పంపే ప్రక్రియను ప్రారంభించారు. జులై 9 డెడ్‌లైన్‌కు (July 9 deadline) ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రపంచ వాణిజ్య వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
డెడ్‌లైన్‌కు ముందే ట్రంప్ వ్యూహాత్మక అడుగులు : “అమెరికా ఫస్ట్” విధానాన్ని (America First policy) మరోసారి స్పష్టం చేస్తూ, ట్రంప్ జులై 4, 2025 (శుక్రవారం) నుంచి కొత్త టారిఫ్ రేట్లను తెలియజేస్తూ దేశాలకు లేఖలు పంపడం ప్రారంభించారు. రోజుకు సుమారు 10 దేశాలకు ఈ లేఖలు పంపే అవకాశం ఉందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. “అమెరికాతో వాణిజ్యం సంబంధాలు కొనసాగించాలంటే.. ఎంత మేర సుంకాలు చెల్లించాలన్న దానిపై ఆయా దేశాలకు లేఖలు పంపిస్తాం ” అని ఆయన స్పష్టం చేశారు.
గతంలో ట్రంప్ టారిఫ్‌లపై ఉన్న డెడ్‌లైన్‌ను పొడిగించవచ్చు లేదా కుదించవచ్చు అంటూ వ్యాఖ్యలు చేసినప్పటికీ, తాజా పరిణామాలు చూస్తుంటే గడువు పొడిగించే అవకాశాలు దాదాపుగా లేవని తెలుస్తోంది. జులై 9 డెడ్‌లైన్‌ను పొడిగించకుండా, ఈ లేఖలు పంపడం ద్వారా ట్రంప్ తన పంతాన్ని నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రేడ్ వార్: ఆరంభం నుంచి ఇప్పటివరకు : డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకపక్షంగా “ట్రేడ్ వార్”ను (Trade War) మొదలుపెట్టారు. ఏప్రిల్ 2, 2025న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. ముఖ్యంగా భారత్, చైనా సహా పలు దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించారు. అనంతరం, ఆయా దేశాలతో ఎగుమతులు, దిగుమతుల సుంకాలపై నిర్ణయం తీసుకోవడం సహా, వాణిజ్య ఒప్పందం చేసుకోవడం కోసం 90 రోజుల గడువు (జులై 9వ తేదీ వరకు) విధించారు. ఆ గడువు పూర్తయ్యే వరకు ప్రతీకార సుంకాల అమలును తాత్కాలికంగా నిలిపివేశారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను గడువులోగా కుదుర్చుకోకపోతే, ఆయా దేశాలపై తమకు నచ్చిన విధంగా ప్రతీకార సుంకాలు విధిస్తామని ట్రంప్ పదేపదే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత్, చైనా, బ్రిటన్ వంటి దేశాలు అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపాయి. చైనాతో ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ ప్రకటించారు. భారత్‌తో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి, రెండు రోజుల్లోగా భారత్-అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Trump Tariff Stance : నూతన టారిఫ్ లేఖలు.. గడువు పెంపు లేనట్లేనా?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES