Trump tariffs India : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై విధించిన 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల కారణంగా భారత్‌పై అమెరికా కఠినంగా వ్యవహరిస్తోందని, ఇది ఎలుక ఏనుగుతో ఢీకొనటం వంటిదని ఆయన అన్నారు. రష్యన్ జర్నలిస్ట్ రిక్ సాంచెజ్‌తో ఇంటర్వ్యూలో వోల్ఫ్ ఈ విషయాలను వెల్లడించారు.
ALSO READ : JD Vance: అమెరికా ప్రెసిడెంట్ పగ్గాలకు రెడీ అంటున్న జేడీ వాన్స్.. అసలు ట్రంప్‌కి ఏమైంది..?
వోల్ఫ్ మాట్లాడుతూ, “ఐక్యరాజ్యసమితి ప్రకారం భారత్ ప్రపంచంలో అతిపెద్ద జనాభా దేశం. అమెరికా చర్యలు భారత్‌ను బ్రిక్స్ దేశాల వైపు నెట్టివేస్తున్నాయి. ఈ సుంకాల వల్ల భారత్ తన ఎగుమతులను అమెరికాకు కాకుండా బ్రిక్స్ దేశాలకు విక్రయిస్తుంది. రష్యా తన ఇంధనాన్ని ఇతర దేశాలకు విక్రయించినట్లే, భారత్ కూడా ఇతర మార్గాలను కనుగొంటుంది,” అని పేర్కొన్నారు.
ALSO READ : JD Vance: అమెరికా ప్రెసిడెంట్ పగ్గాలకు రెడీ అంటున్న జేడీ వాన్స్.. అసలు ట్రంప్‌కి ఏమైంది..?
ఆయన హెచ్చరిస్తూ, ట్రంప్ సుంకాలు బ్రిక్స్ దేశాలను మరింత బలోపేతం చేస్తాయని, పశ్చిమ దేశాలకు ఆర్థిక ప్రత్యామ్నాయంగా మారతాయని అన్నారు. ప్రపంచ ఉత్పత్తిలో బ్రిక్స్ దేశాల వాటా 35 శాతం ఉండగా, జీ7 దేశాల వాటా 28 శాతానికి పడిపోయిందని వోల్ఫ్ గుర్తుచేశారు. సోవియట్ యూనియన్ కాలం నుంచి భారత్-రష్యా మధ్య దీర్ఘకాల సంబంధాలున్నాయని, అమెరికా చర్యలు ఈ సంబంధాలను దెబ్బతీయలేవని వివరించారు. ఈ చర్యలతో అమెరికా తనను తాను దెబ్బతీసుకుంటోందని వోల్ఫ్ విమర్శించారు.


