Trump Bold Demand: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌తో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఇరాన్ ఘోరంగా ఓడిపోయిందని, ఖమేనీ ఈ ఓటమిని ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై దాడి ద్వారా “చెంప చెల్లు” ఇచ్చామన్న ఖమేనీ వాదనను ట్రంప్ వ్యంగ్యంగా తోసిపుచ్చారు. ఇజ్రాయెల్ రచించిన ఖమేనీ హత్య ప్రణాళికను తాను వీటో చేసి, అతన్ని “ఘోర మరణం” నుంచి కాపాడానని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.
అసలేంజరిగింది:
2025 జూన్ 13న ఇజ్రాయెల్ “ఆపరేషన్ రైజింగ్ లయన్” పేరుతో ఇరాన్‌లోని టెహ్రాన్, నటాంజ్, ఇస్ఫహాన్‌లలో అణు, సైనిక స్థావరాలపై దాడులు ప్రారంభించింది. ఇరాన్ “ఆపరేషన్ ట్రూ ప్రామిస్ III” ద్వారా బాలిస్టిక్ క్షిపణులు, హైపర్‌సోనిక్ ఆయుధాలు, డ్రోన్‌లతో ప్రతిస్పందించింది. ఈ ఘర్షణలో ఇరాన్‌లో 585 మంది, అందులో 239 మంది పౌరులు మరణించగా, 1,300 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్‌లో 24 మంది పౌరులు మరణించారు, 370 మంది గాయపడ్డారు. జూన్ 21న అమెరికా బీ-2 బాంబర్లతో ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది. జూన్ 25న అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగింది.
ట్రంప్ వాదనలు:
ట్రూత్ సోషల్‌లో ట్రంప్, అమెరికా “బంకర్ బస్టర్” బాంబులతో (భూగర్భ లక్ష్యాలను ధ్వంసం చేసే భారీ ఆయుధాలు) ఇరాన్ అణు కేంద్రాలను నాశనం చేసిందని, ఇరాన్ దేశం తల్లకిందులైందని పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం నెలల తరబడి వెనక్కి జరిగిందని అమెరికా రహస్య విభాగం (డీఐఏ) అంచనా వేసిందని చెప్పారు. ఇజ్రాయెల్ ఖమేనీ హత్య ప్రణాళికను తాను అడ్డుకున్నానని, మేము ఇరాన్ పై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నప్పటికీ, ఖమేని ఎక్కడున్నాడో తెలిసినప్పటికీ, ఆయన్ను చంపనివ్వలేదు. నేనే రక్షించాను. నాకు థ్యాంక్స్ చెప్పకున్నా ఫర్వాలేదు” అని ట్రంప్ తెలిపారు.
ఖమేనీ స్పందన:
జూన్ 26న ఖమేనీ తొలిసారి బహిరంగంగా మాట్లాడుతూ, ఖతార్‌లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై దాడి ద్వారా అమెరికాకు “చెంప చెల్లు” ఇచ్చామని పేర్కొన్నారు. అణు కేంద్రాలకు నష్టం తక్కువేనని, ట్రంప్ అతిశయోక్తులు చేస్తున్నారని విమర్శించారు. అమెరికా మరోసారి దాడి చేస్తే “తీవ్ర పరిణామాలు” ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఇరాన్ ప్రజలు “శరణాగతి” చేయబోమని, యుద్ధానికి యుద్ధంతో స్పందిస్తామని నొక్కిచెప్పారు.
అణు ఒప్పంద చర్చలను సంక్లిష్టం:
ట్రంప్ వాదనలు ఇరాన్‌తో ఉద్రిక్తతలను పెంచాయి, అణు ఒప్పంద చర్చలను సంక్లిష్టం చేశాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రాజ్యాంతరం సంభవించవచ్చని సూచించగా, రక్షణ మంత్రి ఇస్రాయెల్ కాట్జ్ ఖమేనీ “ఉనికిలో ఉండకూడదు” అన్నారు. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) టెహ్రాన్‌లో సెంట్రిఫ్యూజ్ రోటర్ భవనం దెబ్బతిన్నట్లు నివేదించింది. ఇరాన్ అణు కార్యక్రమం పునర్నిర్మాణ సామర్థ్యం ఉందని నిపుణులు హెచ్చరించారు.