Monday, February 16, 2026
Homeఇంటర్నేషనల్Kevin Warsh: జెరోమ్ పావెల్ స్థానంలో ఫెడ్ కొత్త బాస్ ఎవరు? ట్రంప్ మైండ్‌లో ఉన్న...

Kevin Warsh: జెరోమ్ పావెల్ స్థానంలో ఫెడ్ కొత్త బాస్ ఎవరు? ట్రంప్ మైండ్‌లో ఉన్న ఈ కెవిన్ వార్ష్ ఎవరు..?

US Federal Reserve: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సారథి మార్పునకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత చైర్మన్ జెరోమ్ పావెల్ స్థానంలో.. ఫెడ్ మాజీ గవర్నర్ కెవిన్ వార్ష్‌ను కొత్త చైర్మన్‌గా నియమించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వార్త బయటకు రావడంతోనే అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా డాలర్ విలువ, అమెరికా ద్రవ్య పరపతి విధానంలో రాబోయే మార్పులపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు.

- Advertisement -

కెవిన్ వార్ష్ పేరు తెరపైకి రావడంతో ప్రెడిక్షన్ మార్కెట్లు కూడా ఆయన వైపు మొగ్గు చూపుతున్నాయి. పాలిమార్కెట్ డేటా ప్రకారం.. గత వారం వరకు 32 శాతంగా ఉన్న ఆయన ఎంపిక అవకాశాలు.. ప్రస్తుతం 93 శాతానికి చేరుకున్నాయి. ఈ రేసులో బ్లాక్‌రాక్ ఎగ్జిక్యూటివ్ రిక్ రీడర్, ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్ వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ.. ట్రంప్ చూపు వార్ష్ వైపే ఉన్నట్లు తెలుస్తోంది. 2017లో కూడా వార్ష్ ఈ పదవికి రేసులో నిలిచారు, అయితే అప్పట్లో ట్రంప్ జెరోమ్ పావెల్‌ను ఎంపిక చేశారు.

also read TTD: కమీషన్ల కోసం కక్కుర్తి.. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారీ- టీటీడీ ఛైర్మన్‌

కెవిన్ వార్ష్ బ్యాక్ గ్రౌండ్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. 2006 నుండి 2011 వరకు ఫెడరల్ రిజర్వ్ గవర్నర్‌గా పనిచేశారు. అతి చిన్న వయసులోనే ఫెడ్ గవర్నర్‌గా నియమితులైన వ్యక్తిగా ఆయన రికార్డు ఉంది. వాల్ స్ట్రీట్ బ్యాంకింగ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీలో మెర్జర్స్ అండ్ అక్వజిషన్స్ విభాగంలో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలోని హూవర్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఎకనామిక్ ఫెలోగా ఉండటమే కాకుండా.. పలు అంతర్జాతీయ కంపెనీలకు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

ఫెడ్ చైర్మన్ గా వార్ష్ సెలక్షన్ అమెరికా డాలర్ స్థిరీకరణకు దోహదపడవచ్చు. ఆయన సాధారణంగా కఠినమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా పేరు పొందారు. అయితే ట్రంప్ వద్ద జరిగిన ఇంటర్వ్యూలో ఆయన కాస్త మెత్తని వైఖరి ప్రదర్శించినట్లు సమాచారం. వాల్ స్ట్రీట్ అలాగే వాషింగ్టన్ రాజకీయ వర్గాల్లో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. జనవరి 28న వైట్ హౌస్‌ను సందర్శించడం ఈ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుందనే సంకేతాలను ఇస్తోంది. అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థను ఆయన ఎలా నడిపిస్తారు ఎంపికైతే అనేది వేచి చూడాల్సిన అంశమే. అదే ప్రపంచ ఆర్థిక దిశను, ఇతర దేశాల పరిస్థితులను కూడా ప్రభావితం చేయనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News