Wednesday, January 14, 2026
Homeఇంటర్నేషనల్Donald Trump : "భారతీయులు భారం కాదు.. అమెరికాకు ఆధారం!"

Donald Trump : “భారతీయులు భారం కాదు.. అమెరికాకు ఆధారం!”

Trump’s welfare-receiving nations list : అమెరికా నుంచి సంక్షేమ సాయం పొందుతున్న దేశాల జాబితాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేయగా, అందులో ఓ ఆసక్తికరమైన, భారతీయులు గర్వపడే వాస్తవం వెలుగులోకి వచ్చింది. 120 దేశాలతో కూడిన ఆ జాబితాలో, మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్ ఉన్నా, భారత్ పేరు మాత్రం కనిపించలేదు. ఇది అమెరికా గడ్డపై భారతీయుల కష్టపడే తత్వానికి, వారి ఆర్థిక స్వావలంబనకు నిలువుటద్దం పడుతోంది. అసలు ట్రంప్ ఈ జాబితాను ఎందుకు విడుదల చేశారు? ఈ లిస్టులో భారత్ లేకపోవడం వెనుక ఉన్న కారణాలేంటి?

- Advertisement -

అమెరికాలో వలసదారులపై ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుపై తరచూ విమర్శలు చేసే డొనాల్డ్ ట్రంప్, తాజాగా తమ దేశ ఖజానా నుంచి సంక్షేమ సాయం పొందుతున్న 120 దేశాల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా, వివిధ దేశాల నుంచి వలస వచ్చిన కుటుంబాలు, అమెరికా ప్రభుత్వంపై ఎంతగా ఆధారపడి ఉన్నాయో స్పష్టం చేస్తోంది.

దిగ్భ్రాంతికరమైన గణాంకాలు : ట్రంప్ విడుదల చేసిన డేటా ప్రకారం, కొన్ని దేశాల నుంచి వలస వచ్చిన వారిలో అధిక శాతం మంది అమెరికా ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
బంగ్లాదేశ్: 54.8% కుటుంబాలు.
ఉక్రెయిన్: 42.7% కుటుంబాలు.
పాకిస్థాన్: 40.2% కుటుంబాలు.
నేపాల్: 34.8% కుటుంబాలు.
చైనా: 32.9% కుటుంబాలు.

మరి భారత్ ఎందుకు లేదు? గర్వకారణమిదే : ఈ జాబితాలో భారత్ పేరు లేకపోవడానికి ప్రధాన కారణం, అమెరికాలో స్థిరపడిన భారతీయుల ఆర్థిక పటిష్టతే.
అధిక ఆదాయం: ప్యూ రీసెర్చ్ సెంటర్  ప్రకారం, అమెరికాలోని ఒక భారతీయ కుటుంబం సగటు వార్షిక ఆదాయం సుమారు $151,200 (రూ.1.25 కోట్లకు పైగా). ఇది అమెరికా జాతీయ సగటు ఆదాయం కంటే చాలా ఎక్కువ.

పన్ను చెల్లింపుదారులు: భారతీయులు అమెరికా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడకుండా, తమ కష్టార్జితంతో జీవిస్తూ, ప్రభుత్వానికి అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నారు.
కీలక వృత్తులలో: అమెరికాలోని ఆసియా జనాభాలో 21% ఉన్న భారతీయులు, వైద్యులుగా, ఇంజినీర్లుగా, కంపెనీలకు సీఈఓలు, మేనేజర్లుగా అత్యంత కీలక బాధ్యతల్లో ఉన్నారు.

ఈ కారణాల వల్లే, ట్రంప్ పరిపాలన, అమెరికాలోని భారతీయులను సంక్షేమం పొందే వారిగా కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చే ‘పన్ను చెల్లింపుదారులు’గా, ‘ఆస్తులు’గా పరిగణిస్తోంది. ఈ జాబితా, ప్రపంచ వేదికపై భారతీయుల ప్రతిష్ఠను మరోసారి ఇనుమడింపజేసింది.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News