Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Immigration Policy: ట్రంప్ కఠిన వైఖరి.. 1960 తర్వాత భారీగా తగ్గిన వలసలు

Immigration Policy: ట్రంప్ కఠిన వైఖరి.. 1960 తర్వాత భారీగా తగ్గిన వలసలు

Immigration Policy: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి తన దైన విధానాలతో ట్రంప్ దూసుకుపోతున్నారు. మాస్ డిపోర్టేషన్, అరెస్టులు, చట్టపరమైన ప్రవేశాలపై ఆంక్షలు..  ఇలా అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి వలసదారులపై ఆయన విరుచుకుపడుతున్నారు. అమెరికా ఆర్థికవ్యవస్థకు అండగా నిలుస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో భవిష్యత్తు కోసం ఆ దేశానికి వెళ్లాలనుకునేవారి సంఖ్య తగ్గిపోతోంది. ఇదే విషయాన్ని ప్యూ రీసెర్చ్‌ సెంటర్ నివేదిక కూడా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ మధ్య వలస జనాభా 15 లక్షలు తగ్గింది. దాంతో ఇమిగ్రెంట్స్‌ సంఖ్య 53.3 మిలియన్ల నుంచి 51.9 మిలియన్లకు పడిపోయింది. 1960 తర్వాత ఇలా వలసదారుల సంఖ్య క్షీణించడం ఇదే తొలిసారి. దీని వల్ల  అనూహ్య మార్పులు ఏర్పడతాయని ప్యూ రీసెర్చ్‌ సెంటర్ డెమోగ్రాఫర్ జెఫ్రె పస్సెల్ మీడియాకు వెల్లడించారు. ఈ క్షీణత లేబర్ మార్కెట్‌పై పడుతోందని ఆందోళన వ్యక్తంచేశారు.
Read Also: Delhi High Court: మళ్లీ సర్వీస్ ఛార్జీలా? ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

- Advertisement -

ప్యూ రీసెర్ట్ సెంటర్ ఆందోళన..

అమెరికా ఆర్థిక వ్యవస్థపై జెఫ్రె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అమెరికా (USA) జనాభాలో పనిచేసే వయసున్న వ్యక్తుల సంఖ్య పెరగడం లేదు. అలాంటప్పుడు ఈ దేశానికి వలసల నుంచే శ్రామికశక్తి లభిస్తుంది. ఈ శ్రామికశక్తి పెరగకపోతే.. ఆర్థిక వ్యవస్థకు కష్టమే’’ అని జెఫ్రె అభిప్రాయపడ్డారు. సరిహద్దుల నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారి సంఖ్యను కట్టడి చేసేందుకు బైడెన్ హయాంలో పలు చర్యలు తీసుకున్నారు. దీంతో, 2024 నుంచే ఈ మార్పు కనిపిస్తోంది. కానీ, ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి త్రం భారీగా పెరిగింది. ఆయన కఠిన వైఖరితో అనధికారిక వలసల సంఖ్య కూడా తగ్గిందని నివేదిక పేర్కొంది. మాస్ డిపోర్టేషన్లు, బహిష్కరణను తప్పించేందుకు ఉన్న రక్షణలు తొలగించడమూ ఈ సంఖ్య తగ్గడానికి కారణమని వెల్లడించింది.

Read Also: Cloudburst in Uttarakhand: ఉత్తరాఖండ్ లో ఆకస్మిక వరదలు.. ఒకరు గల్లంతు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad